పైగా వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లతో యమ బిజీగా ఉంది రష్మిక. ఇటు ఇక్కడ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే, అటు బాలీవుడ్ లోనూ అవకాశాలను అందుకుంటుంది. ఒకేసారి బాలీవుడ్ లో గుడ్ బై, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు మరో సినిమాకు కూడా సైన్ చేసిందని తెలుస్తోంది.
మొత్తానికి బాలీవుడ్ లో రష్మిక లాంగ్ లైఫ్ ను ప్లాన్ చేసుకుంటుంది. అందుకే ముంబైలో ఓ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిందట. ఈ మధ్యే ఆ కొత్త ఇంట్లోకి కూడా రష్మిక షిఫ్ట్ అయిందట. ఈ విషయాన్ని రష్మిక తన ఇన్ స్టా ద్వారా తెలియజేస్తూ.. ‘అవును, ఎట్టకేలకు నేను కొత్త అపార్ట్ మెంట్ లోకి షిఫ్ట్ అయ్యాను. అపార్ట్ మెంట్ కోసం చాలానే షాపింగ్ చేయాల్సి వచ్చింది.
కాకపోతే ఇంకా నేను కొనాల్సినవి చాలా ఉన్నాయి. ఇక నా అసిస్టెంట్ సాయి, నేను ముంబై హౌస్ లోకి షిఫ్ట్ అవ్వడంలో నాకు చాలా సహాయం చేశాడు. నా పప్పీ, నేను చాలా అలసటతో ఉన్నాము’ అంటూ రష్మిక తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఇక ఈ విల్లా ధర చాలా కాస్ట్ లీ అని టాక్. ఇక ఈ అమ్మడు ఒక్కో సినిమాకి ఏకంగా రెండు కోట్ల డెబ్బై లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందట.