
Rashmika Mandanna: రష్మిక మందాన జోరు మామూలుగా లేదు. పాన్ ఇండియా చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏడాది బిగినింగ్ లోనే రెండు భారీ చిత్రాలు విడుదల చేసింది. హిందీ చిత్రం మిషన్ మజ్ను ఓటీటీలో విడుదల చేశారు. ఇక విజయ్ కి జంటగా చేసిన వారసుడు సంక్రాంతి కానుకగా విడుదలైంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న వారసుడు వసూళ్ళపరంగా దుమ్ము దులిపింది. తమిళ వెర్షన్ వారిసు రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు అధికారిక పోస్టర్స్ విడుదల చేశారు. మిషన్ మజ్ను మాత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
ప్రస్తుతం రష్మిక యానిమల్, పుష్ప 2 చిత్ర షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. యానిమల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ఆయన గత రెండు చిత్రాలు అర్జున్ రెడ్డి, ఆ చిత్ర రీమేక్ కబీర్ సింగ్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఈ క్రమంలో యానిమల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. యానిమల్ పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు.
ఇక ఇటీవల పుష్ప 2 షూట్ మొదలైంది. అల్లు అర్జున్-సుకుమార్ ల ఈ పీరియాడిక్ క్రైమ్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. పుష్ప 1 సక్సెస్ నేపథ్యంలో బడ్జెట్ రెండింతలు పెంచి పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు. క్యాస్టింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. వివిధ పరిశ్రమలకు చెందిన నటులు పుష్ప 2 లో భాగం కానున్నారు.పుష్ప 2 తన కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని రష్మిక నమ్ముతున్నారు. స్క్రిప్ట్ లో అనేక మార్పులు చేసిన సుకుమార్ రష్మిక పాత్ర నిడివి తగ్గించేశారనే ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియదు.

ఇదిలా ఉంటే రష్మిక లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆమె ఫోటో షూట్లో భాగంగా బోల్డ్ ఫోజులతో టెంప్టింగ్ హాట్ గా దర్శనమిచ్చారు. బాత్రూం లో కురచ బట్టల్లో ఆమెపై ఫోటో షూట్ చేశారు. ఈ యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో రష్మిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ మీరు చాలా హాట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక బోల్డ్ వీడియో అతిపెద్ద చర్చకు దారి తీసింది. కాగా రష్మిక హీరో విజయ్ దేవరకొండతో ఎఫైర్ నడుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఒక ప్రక్క ఖండిస్తూనే సన్నిహితంగా ఉంటున్నారు.