Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna: తక్కువ పోస్ట్ లతో ఎక్కువ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న... రష్మిక మందన్నా

Rashmika Mandanna: తక్కువ పోస్ట్ లతో ఎక్కువ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న… రష్మిక మందన్నా

Rashmika Mandanna: రష్మిక మందన్నా… ఛలో సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ కన్నడ భామ. తెలుగులో తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ తరుణంలోనే ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి.

rashmika mandanna got huge following on instagram

ఈ అమ్మడుకి టాలెంట్‌తో పాటు కాస్త లక్‌ కూడా కలిసొచ్చింది అని చెప్పాలి. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ రేస్‌లో నిలబడింది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. వ్యక్తిగత విషయాలతో పాటు తన సినిమాలకు సంబందించిన అప్డేట్స్ ని కూడా  అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రష్మిక. దాంతో ఈ బ్యూటీకి నెట్టింట ఫాలోవర్స్ కూడా భారీగానే పెరిగిపోయారు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడికి 23.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక కేవలం 394 పోస్ట్ లతో 23 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు స్టార్ హీరోయిన్స్ గా కంటిన్యూ అవుతున్న ఏ హీరోయిన్ కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ ను సొంతం చేసుకోలేదు. ఈ క్రెడిట్ దక్కించుకున్న ఏకైక భామ రష్మిక మందన్నానే కావడం విశేషం. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన పుష్పా సినిమాలో నటిస్తుంది. కాగా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 న ఈ మూవీ విడుదల కానుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular