https://oktelugu.com/

Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక హాట్ వీడియో వైరల్, చర్యలు తీసుకోవాలన్న అమితాబ్… అసలు మేటర్ ఇదే!

నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందాన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు వీడియో బోల్డ్ గా ఉంది. వల్గారిటీతో కూడిన రష్మిక మందాన వీడియో చర్చకు దారి తీసింది.

Written By:
  • Neelambaram
  • , Updated On : November 6, 2023 / 01:28 PM IST
    Follow us on

    Rashmika Mandanna: రష్మిక మందాన పేరున ఓ హాట్ వీడియో వైరల్ అవుతుండగా సీనియర్ నటుడు అమితాబ్ స్పందించారు. ఇలాంటి వీడియోల మీద చర్యలు తీసుకోవాలని కామెంట్ చేశారు. రష్మిక మందాన ఇండియాలోని టాప్ హీరోయిన్స్ లో ఒకరు. సౌత్ టు నార్త్ దున్నేస్తున్న ఈ భామ పలు భాషల్లో సినిమాలు చేస్తుంది. రష్మిక మందానకు భారీ ఫ్యాన్ బేస్ ఉంది. హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందాన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు వీడియో బోల్డ్ గా ఉంది. వల్గారిటీతో కూడిన రష్మిక మందాన వీడియో చర్చకు దారి తీసింది.

    నిజానికి అది ఒరిజినల్ వీడియో కాదు. ఆ వీడియోలో ఉంది రష్మిక అంతకన్నా కాదు. ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఓ జర్నలిస్ట్ హైలెట్ చేశాడు. రష్మిక పేరుతో ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. ఇది సీరియస్ మేటర్. ఇలాంటి తప్పుడు చర్యలను కట్టడి చేసేలా కఠిన చట్టాలు తీసుకురావాలంటూ… ఆయన ట్వీట్ చేశారు. ఫేక్ వీడియోతో పాటు ఒరిజినల్ వీడియో పోస్ట్ చేశారు.

    జర్నలిస్ట్ ట్వీట్ పై స్పందించిన అమితాబ్… ‘అవును ఇది చట్టం చర్యలు తీసుకోవాల్సిన సీరియస్ కేస్’ అని కామెంట్ చేశారు. ఒరిజినల్ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు జరా పటేల్. ఈమె భారతీయ మూలాలున్న బ్రిటిష్ యువతి. జరా పటేల్ అక్టోబర్ 9న ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఉన్న జరా పటేల్ ముఖం రష్మిక ముఖంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

    చాలా మంది నెటిజెన్స్ అది రష్మిక మందాన ఒరిజినల్ వీడియో అని భావిస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని అమితాబ్ వంటి నటులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. కాగా ‘గుడ్ బై’ టైటిల్ తో తెరకెక్కిన హిందీ చిత్రంలో అమితాబ్-రష్మిక మందాన ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం రష్మిక పుష్ప 2, యానిమల్ వంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.