Vijay Deverakonda-Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందాన, హీరో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొంత కాలంగా రూమర్స్ వస్తున్నాయి. అయితే తాజాగా రష్మిక చేసిన ట్వీట్ ఒకటి వైరల్ గా మారింది. ఈ జంట పై వస్తున్న రూమర్స్ నిజమే అనేలా… రష్మిక చేసిన కామెంట్ ఉన్న నేపథ్యంలో, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక విధంగా విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తనకు కాబోయే భర్త అని రష్మిక కన్ఫర్మ్ చేసినట్లు అయ్యింది. దాంతో రష్మిక కామెంట్ వైరల్ అవుతుంది.
కాగా రష్మికను ఉద్దేశిస్తూ ఓ ఫ్యాన్ పేజీలో .. రష్మిక కాబోయే భర్త VD లా ఉండాలి.అంటే వెరీ డేరింగ్ అని అర్థం. అనుక్షణం ఆమెను రక్షించాలి. అలాగే మేము రష్మికను క్వీన్ అని పిలుచుకుంటాము. కాబట్టి అతడు కింగ్ అయి ఉండాలి .. అని పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ కి స్పందించిన రష్మిక .. ‘ అవును అది వాస్తవం ‘ అని కామెంట్ పెట్టింది. విజయ్ దేవరకొండను షార్ట్ గా VD అని కూడా ఫ్యాన్స్ పిలుచుకుంటారు. ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ అనే అర్థంలోనే ఆ పోస్ట్ చేశారు.
ఫ్యాన్స్ ఉద్దేశం తెలిసి కూడా రష్మిక ఇలా అవును అని ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. రష్మిక తనకు కాబోయే భర్త విజయ్ దేవరకొండ అని చెప్పకనే చెప్పేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక – విజయ్ మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో ఈ ఇద్దరి పెళ్లి వార్త వింటామని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రష్మిక మందాన రీసెంట్ గా యానిమల్ మూవీ తో భారీ విజయం అందుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప 2 లో శ్రీవల్లి గా మెప్పించనుంది. ఇక విజయ్ ఫ్యామిలీ స్టార్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఫ్యామిలీ స్టార్ తో పాటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.