Rashmika Mandanna: అదృష్టానికి నిలువెత్తు నిదర్శనం రష్మిక మందాన. కేవలం ఐదేళ్లలో రష్మిక నేషనల్ క్రష్ రేంజ్ కి వెళ్లారు. నాగ శౌర్య రేంజ్ నుండి మహేష్ రేంజ్ కి ఎదగడానికి రష్మికకు ఎక్కువ సమయం పట్టలేదు. సక్సెస్ రేటు ఆమెను అంత త్వరగా ఎదిగేలా చేసింది. టాలీవుడ్ లో రష్మిక మొదటి చిత్రం ఛలో. వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో సూపర్ హిట్ అందుకుంది. 2018 రష్మిక కెరీర్లో బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆమె లైఫ్ ని మలుపు తిప్పిన ఏడాది అది. ఛలో, గీత గోవిందం వంటి భారీ హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి.

గీత గోవిందం సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ యూత్ ని పిచ్చెక్కించింది. ఒక స్టార్ హీరో హిట్ సినిమా వసూళ్లు గీత గోవిందం సాధించింది. నిర్మాతలు, బయ్యర్లు పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జించారు. గీత గోవిందం రష్మికకు ఎక్కడలేని ఫేమ్ తెచ్చింది. ఇక నానికి జంటగా చేసిన దేవదాసు పర్వాలేదు అనిపించింది. డియర్ కామ్రేడ్ నిరాశపరిచినా, మహేష్ తో ఛాన్స్ కొట్టేసింది.
సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ కి జంటగా దర్శకుడు అనిల్ రావిపూడి రష్మికను ఎంచుకున్నారు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు రికార్డు వసూళ్లు రాబట్టింది. ఆ దెబ్బతో స్టార్ హీరోల ఛాయిస్ అయ్యారు రష్మిక. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నవన్నీ భారీ చిత్రాలే. పుష్ప 2 దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రన్బీర్ కపూర్ కి జంటగా చేస్తున్న యానిమల్ సైతం భారీ పాన్ ఇండియా చిత్రం.

ఇక వారసుడు మూవీతో సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించనుంది. విజయ్ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు చిత్రంపై పాజిటివ్ బజ్ ఉంది. దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ లో చేరిన ఈ కన్నడ భామను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సొంత పరిశ్రమే ఆమెపై కత్తులు నూరుతుంది. రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ కన్నడిగుల మనోభావాలు దెబ్బతీశాయి. అయితే బాలీవుడ్, టాలీవుడ్ లో దూసుకుపోతున్న రష్మిక, అవేమీ పట్టించుకోవడం లేదు. కెరీర్ జోరుగా ఉండగా.. మరోవైపు హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది. తాజాగా లోదుస్తులు లేకుండా హాట్ క్లీవేజ్ షోతో రష్మిక హీటెక్కించారు. ఆమె బోల్డ్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.