Rashmika Mandanna: ఒకప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్లు అంటే కేవలం బాలీవుడ్ వారినే పిలిచేవారు. అంతర్జాతీయ ఫంక్షన్స్ లో కూడా బాలీవుడ్ హవా కొనసాగేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బాలీవుడ్ కన్నా కూడా సౌత్ ఇండియా వారు ఎంతో ఫేమస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మన సౌత్ హీరో హీరోయిన్స్ జాతీయంగా లేదా అంతర్జాతీయంగా ఏదైనా పెద్ద ఫంక్షన్స్ జరిగితే అందరూ ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు మన సౌత్ వారే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు.
అసలు విషయానికి వస్తే అంబానీ ఇంట్లో వేడుకలు అంటే కచ్చితంగా బాలీవుడ్ బడా స్టార్లు దిగి రావాల్సిందే. అయితే ఇప్పుడు ఆ స్థానంలో మన సౌత్ వారిని కూడా పిలుస్తున్నారు అంబానీ. ప్రతీ ఏటా అంబానీ ఇంట్లో వినాయక చవితి వేడుకలు అంబరాన్ని అంటుతాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ బడా స్టార్లు వస్తుంటారు. కానీ ఈ సారి మన సౌత్ స్టార్లు కూడా అక్కడ కనిపించారు. అట్లీ, నయనతార, రష్మిక మందాన లాంటివారు ఈ ఫంక్షన్ లో మెరిసారు.
ఈ నేపథ్యంలో రష్మిక మందానికి మాత్రం కొంచెం అభిమానం జరగడంతో ఆమె ఫ్యాన్స్ తెగ హర్ట్ అవుతా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే అంబాని ఇంట్లో జరిగిన కార్యక్రమంలో రష్మికకు సరైన గుర్తింపు లభించలేదనిపిస్తోంది.
ఇక వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఏముంది అనగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ ముందు నుంచి నడుస్తూ వస్తుంటే.. రష్మిక నవ్వుకుంటూనే చూసింది. కానీ శ్రద్దా కపూర్ మాత్రం రష్మిక మందాన ని కనీసం చూడను కూడా చూడలేదు. కావాలనే ఇగ్నోర్ చేసిందా? అంటూ రష్మిక ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
పుష్ప సినిమాతో బాలీవుడ్ లో సైతం ప్రత్యేక స్థానం తెచ్చుకునింది రష్మిక. కానీ శ్రద్ధ కపూర్ ఇలా రష్మిక ని చూసి చూడనట్టు వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇలా రష్మికను శ్రద్దా కపూర్ అవాయిడ్ చేయడం మీద అభిమానులు మండిపడుతున్నారు. మరోపక్క రష్మిక అభిమానులు మాత్రం రష్మిక నేషనల్ క్రష్ కాబట్టి శ్రద్ధా కపూర్ జలస్ ఫీలయ్యి రష్మికాని పలకరించి ఉండదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.