https://oktelugu.com/

Rashmika Mandana: ఫ్యాన్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేసిన రష్మిక మందన.. ఆ సినిమా వల్లనేనా?

కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక జంటగా వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఇందులో రాధికా, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. 2022లో ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 14, 2024 / 04:19 PM IST

    Rashmika Mandana

    Follow us on

    Rashmika Mandana: రష్మిక మందన ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, హిందీ భాషల్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా అయింది ఈ బ్యూటీ. ఇక రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయిన యానిమల్ సినిమాతో మరింత పాపులారిటీని సంపాదించింది. అయితే ప్రస్తుత ఈ బ్యూటీ పుష్ప 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఎక్స్ వేదికగా ఓనెటిజన్ అడిగిన ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఇంతకీ ఏ జరిగిందంటే..

    కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక జంటగా వచ్చిన సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఇందులో రాధికా, ఖుష్బూ, ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. 2022లో ప్రేక్షకుల ముందకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఇక ఇందులో రష్మిక నటించడం పట్ల ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఈ సినిమా స్క్రిప్ట్ మీకు నచ్చలేదు. అయినా కిషోర్ తిరుమల, శర్వాల మీద ఉన్న నమ్మకంతో సినిమాకు సంతకం చేసింది అంటూ విచారం వ్యక్తం చేస్తున్న ఎమోజీలను పంచుకున్నారు నెటిజన్.

    దీనిపై రష్మిక స్పందిస్తూ.. ఎవరు చెప్పారు మీకు. స్క్రిప్ట్ పై నాకు నమ్మకం ఉంటేనే సినిమాలు చేస్తా. ఆ సినిమా బృందంతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం. ఇలాంటి నిరాధార వార్తలు ఎక్కడి నుంచి పుడుతాయో ఆశ్యర్యంగా ఉంది అంటూ తలపట్టుకున్న ఎమోజీలతో సమాధానం చెప్పింది రష్మిక. ఇక కొన్ని రోజుల క్రితం ఈమె ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆ చర్యను ఖండిస్తూ రష్మికకు మద్దతుగా నిలిచారు.

    అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ది రూల్ లో నటిస్తోంది.పార్ట్ 1 సూపర్ హిట్ అవడంతో పార్ట్ 2పై కూడా ఆశలు పెట్టుకున్నారు చిత్ర యూనిట్. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో..