https://oktelugu.com/

Rashmika Mandana: మాజీ ప్రియుడ్ని మళ్ళీ గెలుకుతున్న రష్మిక… వాళ్లతో అది చేస్తే తప్పేం లేదట!

Rashmika Mandana: హీరో రక్షిత్ శెట్టితో బ్రేకప్ రష్మిక మందాన జీవితంలో అతి పెద్ద వివాదం. ఇండస్ట్రీలో అడుగుపెడుతూనే రష్మిక ప్రేమాయణం మొదలు పెట్టింది. ఆమె డెబ్యూ మూవీ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. 2016లో విడుదలైన కిరాక్ పార్టీ సెట్స్ లో రష్మిక-రక్షిత్ ప్రేమలో పడ్డారు. చక్కగా చట్టపట్టాలేసుకు తిరిగారు. అప్పటికి రష్మిక వయసు కేవలం 20 ఏళ్ళు. ప్రేమ మైకంలో పెళ్ళికి సిద్ధమైపోయింది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా… రష్మిక […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2022 / 12:45 PM IST
    Follow us on

    Rashmika Mandana: హీరో రక్షిత్ శెట్టితో బ్రేకప్ రష్మిక మందాన జీవితంలో అతి పెద్ద వివాదం. ఇండస్ట్రీలో అడుగుపెడుతూనే రష్మిక ప్రేమాయణం మొదలు పెట్టింది. ఆమె డెబ్యూ మూవీ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. 2016లో విడుదలైన కిరాక్ పార్టీ సెట్స్ లో రష్మిక-రక్షిత్ ప్రేమలో పడ్డారు. చక్కగా చట్టపట్టాలేసుకు తిరిగారు. అప్పటికి రష్మిక వయసు కేవలం 20 ఏళ్ళు. ప్రేమ మైకంలో పెళ్ళికి సిద్ధమైపోయింది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా… రష్మిక మనసు మార్చుకుంది. ఇప్పుడే పెళ్లి చేసుకోనని సాకు చెప్పింది. రష్మిక నిర్ణయం రక్షిత్ శెట్టికి బిగ్ షాక్ ఇచ్చింది.

    రష్మిక పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి అసలు కారణం సినిమానే. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని రక్షిత్ ప్రియురాలు రష్మికకు నిబంధన పెట్టాడు. దానికి ఆమె ఒప్పుకుంది. నిశ్చితార్థం అయ్యాక మనసు మారింది. కిరాక్ పార్టీ హిట్ కావడంతో ఆఫర్స్ వస్తున్నాయి. కెరీర్ ని వదులుకోవడం ఇష్టం లేక ప్రేమని వదులుకుంది. రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పేసింది. రష్మిక నిర్ణయం రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేసింది. సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు. కాగా రష్మికను ఎవరూ దూషించవద్దని రక్షిత్ ఫ్యాన్స్ ని ఆదేశించాడు.

    ఈ కథ ముగిసి చాలా కాలం అవుతుంది. తాజాగా మాజీ ప్రియుడు రక్షిత్ గురించి రష్మిక స్పందించారు. మీరు మళ్ళీ రక్షిత్ శెట్టితో టచ్ లో ఉంటున్నారటగా అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు. అందులో తప్పేముంది, మాజీ లవర్స్ తో స్నేహం చేయడం నేరమేమీ కాదు. వీలైతే ఆయనతో మళ్ళీ నటిస్తా అంటూ రక్షిత్ ని గెలికింది. పెళ్లిదాకా వెళ్లి విడిపోయారు. ఎవరి దారిన వాళ్లు ఉంటున్నారు. మళ్ళీ ఈ కలయికలు, స్నేహాలు అవసరమా అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుత ప్రియుడిగా ప్రచారం అవుతున్న విజయ్ దేవరకొండ గురించి కూడా ఆమె స్పందించారు. విజయ్ దేవరకొండతో ముడిపెడుతూ రాసే రూమర్స్ క్యూట్ గా ఉంటాయని బోల్డ్ సమాధానం చెప్పింది.

    రష్మిక లేటెస్ట్ మూవీ గుడ్ బై. వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ అక్టోబర్ 7న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర చేశారు. ఈ క్రమంలో ఆమె చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం రష్మిక తెలుగులో రెండు, హిందీలో రెండు భారీ చిత్రాలు చేస్తున్నారు. పుష్ప 2, వారసుడు, యానిమల్, మిషన్ మజ్ను చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.