https://oktelugu.com/

AP Cinema Tickets: ఏపీ టికెట్​ ధరల విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం

AP Cinema Tickets: ఆంధ్రప్రదేశ్​లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ హైకోర్డు ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్​ ధరలు తగ్గిస్తూ ప్రబుత్వం ఇచ్చిన జీవో నెంబర్​ 35పా విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ముందు ఈ అంశాన్ని జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ఆయనే ఈ నిర్ణయం తీసుకుంటారని థియేటర్ల యాజమాన్యానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 01:51 PM IST
    Follow us on

    AP Cinema Tickets: ఆంధ్రప్రదేశ్​లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఏపీ హైకోర్డు ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సినిమా టికెట్​ ధరలు తగ్గిస్తూ ప్రబుత్వం ఇచ్చిన జీవో నెంబర్​ 35పా విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ముందు ఈ అంశాన్ని జాయింట్ కలెక్టర్ ముందుంచాలని.. ఆయనే ఈ నిర్ణయం తీసుకుంటారని థియేటర్ల యాజమాన్యానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయాలని ఆదేశించింది హైకోర్టు.

    AP Cinema Tickets

    Also Read: టికెట్‌ రేట్ల‌పై విచార‌ణ వాయిదా.. పుష్ప మూవీకి బిగ్ రిలీఫ్‌..!

    ఇటీవలే ఏప్రిల్ 8వ సినిమా టికెట్​ ధరలను తగ్గిస్తూ.. ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగి తెలిసిందే. ఈ క్రమంలోనే థియేటర్ల యజమానులు, సినిమా నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్​ జడ్జి.. జీవోను కొట్టిపడేస్తూ తీర్పు ఇచ్చారు. జీవో 35కు ముందు అనుసరించిన పద్దతిలోనే టికెట్ ధరలను  నిర్ణయించుకునేలా కోర్టు ఆదేశాలు జారి చేసింది. అయితే, హైకోర్టు ఆదేశాలను సవాల్​ చేస్తూ ఏపీ ప్రభుత్వం తరఫున హోంశాఖ కార్యదర్శి డివిజన్​ బెంచ్​లో అప్పీల్​ చేశారు. ప్రస్తుతం దీనిపై ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్​ కుమార్​ మిశ్రా, జస్టిస్​ ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

    ఏదైనా కొత్త సినిమాలు విడుదలైతే.. టికెట్​ ధరలు పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుంది.. అయితే, ఇలా చేయడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడతారని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు వినిపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. టికెట్​ ధరల ప్రదిపాదనలను జాయింట్ కలెక్టర్​కు సమర్పించాలని థియేటర్​ యజమానులకు సూచించింది న్యాయస్థానం. అనంతరం ఇరువైపుల వాదనలు విని.. తీర్పును రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

    Also Read: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…