Pushpa: బన్నీ ఫేవరేట్​ సాంగ్​పై శ్రీవల్లి ఆసక్తికర కామెంట్​!

Pushpa: స్టైలిస్ట్​ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తొలి భాగాన్ని పుష్ప దిరైజ్​ డిసెంబరు 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పాన్​ ఇండియా లెవెల్​లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మాస్​ సాంగ్​ ఏయ్​ బిడ్డా ఇది […]

Written By: Raghava Rao Gara, Updated On : November 14, 2021 5:48 pm
Follow us on

Pushpa: స్టైలిస్ట్​ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తొలి భాగాన్ని పుష్ప దిరైజ్​ డిసెంబరు 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పాన్​ ఇండియా లెవెల్​లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలు ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన మాస్​ సాంగ్​ ఏయ్​ బిడ్డా ఇది నా అడ్డ పాట అప్​డేట్​ను విడుదల చేసింది చిత్రబృందం. నవంబరు 19న ఈ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ పాట తనకెంతో ఫేరవేట్​ అని అల్లు అర్జున్​ సోషల్​ మీడియా వేదికగా తెలిపారు. ఈ పాట కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్​గా నటిస్తున్న రష్మిక.. అల్లు అర్జున్​ పోస్ట్​పై ఆసక్తికర కామెంట్​ చేసింది.

https://twitter.com/iamRashmika/status/1459779589530533897?s=20

నిజంగా ఈ పాట సూపర్​గా ఉంటుంది. ఈ పాట కోసం నేనైతే ఎదురు చూడలేకపోతున్నాను. అంటూ కామెంట్​ చేసింది రష్మిక. ఇప్పటి వరకు విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామి సామి పాటలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. మిలియన్ల వ్యూస్​తో యూట్యూబ్​లో దూసుకెళ్లిపోతున్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్​, దేవి శ్రీ ప్రసాద్​ కాంబినేషన్​లో వచ్చిన ప్రతి సినిమాలోని పాటలు ఎంతో సూపర్​హిట్​గా నిలిచాయి. ఆ మార్కును పుష్పలోనూ చూపిస్తున్నారు.