https://oktelugu.com/

Oopiri: ఊపిరి సినిమాలో నాగార్జున కార్తీ మొదటి చాయిస్ కాదట… ఎవరిని అనుకున్నారంటే..?

'ఊపిరి ' సినిమా విషయంలో ఆయన నాగార్జున కార్తీ లను కాకుండా ముందుగా వేరే హీరోలను అనుకున్నాడట.. అందులో ముఖ్యంగా నాగార్జున చేసిన క్యారెక్టర్ కోసం ముందుగా వెంకటేష్ ని, కార్తీ చేసిన క్యారెక్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ చేత చేయించాలని అనుకున్నాడట.

Written By:
  • Gopi
  • , Updated On : June 14, 2024 / 08:51 AM IST

    Oopiri

    Follow us on

    Oopiri: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక ఆయన మొదటి నుంచి కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక ప్రభాస్ తో చేసిన మున్నా సినిమాతో డైరెక్టర్ గా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ఆయన సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతూ విజయ్ ‘వారసుడు ‘ సినిమా వరకు వరుసగా మంచి సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ‘ఊపిరి ‘ సినిమా విషయంలో ఆయన నాగార్జున కార్తీ లను కాకుండా ముందుగా వేరే హీరోలను అనుకున్నాడట.. అందులో ముఖ్యంగా నాగార్జున చేసిన క్యారెక్టర్ కోసం ముందుగా వెంకటేష్ ని, కార్తీ చేసిన క్యారెక్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ చేత చేయించాలని అనుకున్నాడట. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమాలోకి నాగార్జున, కార్తీ ఇద్దరు వచ్చారు. అయితే ఈ సినిమాలో వీళ్లిద్దరు నటించి మెప్పించడమే కాకుండా సినిమాని సూపర్ సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహించారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా వీళ్ళు ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా వంశీ పైడిపల్లి కూడా దర్శకుడుగా ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకున్నాడు.

    ఇక ఈ సినిమా వల్లనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సైతం వంశీ పైడిపల్లికి పిలిచి మరి మహర్షి సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఇక మొత్తానికైతే ఊపిరి సినిమాలో నాగార్జున, కార్తీ ఇద్దరి మధ్య కూడా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అయింది. వీళ్ల మధ్య వచ్చే సీన్లలో కామెడీతో పాటు ఎమోషన్స్ ను కూడా చాలా బాగా పండిస్తూ ప్రేక్షకులందరిని మెప్పించారు…

    ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాగార్జున కార్తీ రియల్ బ్రదర్స్ ఎలా అయితే ఉంటారో అలాంటి ఒక బాండింగ్ తో నటించి మెప్పించారు. ఇక ప్రస్తుతం వంశీ పైడిపల్లి మరో కొత్త సినిమా చేయడానికి స్క్రిప్ట్ రాస్తూ బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది…