Rashmika breaks Virat Kohli record: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) జంటకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ముందు ఎవరూ సరిపోరు అనేది మరోసారి రుజువు అయ్యింది. ఇన్ స్టాగ్రామ్ హిస్టరీ లోనే ఇప్పటి వరకు ఏ టాప్ సెలబ్రిటీకి రానంత రీచ్ వీళ్లిద్దరి పోస్టులకు రావడం హాట్ టాపిక్ గా మారిన అంశం. పూర్తి వివరాల్లోకి వెళ్తే రష్మిక తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన పెళ్లి ఫోటోలకు అక్షరాలా 24 మిలియన్ల లైక్స్ , 2 లక్షల 18 వేల రీపోస్టులు, 3 లక్షల 22 వేల కామెంట్స్, 22 లక్షల షేర్స్ వచ్చాయి. ఈ స్థాయిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ , అదే విధంగా పాపులర్ క్రికెటర్ పోస్టులకు కూడా రాలేదు. గతంలో విరాట్ కోహ్లీ(Virat Kohli) 22.9 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇండియా T20 వరల్డ్ కప్ కొట్టినప్పటి పోస్ట్ ఇది.
ఇక ఆ తర్వాత RCB కప్ కొట్టినప్పుడు కోహ్లీ వేసిన పోస్టు కి 19.8 మిలియన్ లైక్స్ రాగా, ఆయన వేసిన రిటైర్మెంట్ పోస్ట్ కి 19.7 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ రికార్డ్స్ ని ఎప్పటికీ ఎవ్వరూ చెరపలేరని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేవారు. కానీ రష్మిక అవలీల గా ఈ రికార్డుని బద్దలు కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు ఈ స్థాయి క్రేజ్ రావడానికి ముఖ్య కారణం, అన్ని భాషల్లోనూ ఆమె పాపులర్ అవ్వడం వల్లే. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈమె ఉన్నంత ఫార్మ్ లో ఏ హీరోయిన్ కూడా లేదు. వరుసగా వెయ్యి కోట్ల సినిమాలను అందుకొని చరిత్ర సృష్టించింది. అదే విధంగా టాలీవుడ్ లో ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది, శాండిల్ వుడ్ లో కూడా అదే తరహాలో క్రేజ్ ఉంది . ఇలా అన్ని భాషల్లోనూ ఆమెకు క్రేజ్ ఉండడం వల్లే ఈ రేంజ్ రీచ్ వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు .
Also Read: తమిళ హీరో విజయ్ తన భార్యతో విడిపోవడానికి కారణం ఆ డైరెక్టర్ చేసిన పని వల్లేనా ?
ఇకపోతే ఈమె తన భర్త విజయ్ దేవరకొండ తో కలిసి ‘రణబలి’ అనే చిత్రం చేస్తోంది . ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని ఇప్పటికే విడుదల చేశారు మేకర్స్. దీనికి ఆడియన్స్ నుండి యావరేజ్ రెస్పాన్స్ వచ్చింది. నేడు ఈ సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోని విడుదల చేశారు. దీనికి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది . పాత కాలం తరహా పాటలను మరోసారి గుర్తు చేసారంటూ సోషల్ మీడియా లో ఈ ప్రోమో ని విన్న ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో గీత గోవిందం , డియర్ కామ్రేడ్ చిత్రాలు వచ్చాయి. వీటిలో ఒకటి హిట్టు, ఇంకోటి ఫట్టు. మరి ఈ సినిమాకు ఎలాంటి ఫలితం రాబోతుందో చూడాలి.