Prabhas Darling: టాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఇమేజి ఉన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి లవర్ బాయ్ ఇమేజి ని తెచ్చిపెట్టిన సినిమా డార్లింగ్..ఈ సినిమా ద్వారా ప్రభాస్ కి యూత్ లో వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు..కరుణాకరన్ దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా 2010 వ సంవత్సరం లో విడుదలై 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది..ఇందులో లో ప్రభాస్ కి జోడిగా ఎంతో క్యూట్ గా నటించిన కాజల్ అగర్వాల్ నటనని అంత తేలికగా మనం మర్చిపోలేము..ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే కాజల్ మరియు ప్రభాస్ కి మధ్య లవ్ ఎఫైర్ కూడా నడిచిందని అప్పట్లో పెద్ద రూమర్ ఉండేది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలీదు కానీ ఈ సినిమాలోకి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని తీసుకునే ముందు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయట.

ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్రం దర్శకుడు కరుణాకరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరైనా కొత్త వారిని తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాడట..అందుకోసం ఆయన అప్పట్లో కొన్ని ఆడిషన్స్ కూడా చేసాడు..కానీ ఎవ్వరు కూడా ఆయనకీ పెద్దగా నచ్చలేదు..దీనితో అప్పటికే తమిళం లో హీరోయిన్ గా పరిచయమైనా రకుల్ ప్రీత్ సింగ్ ని చూసి, ఈమె మన సినిమాకి పర్ఫెక్ట్ గా ఉంటుందని ప్రభాస్ ని ఒప్పించి ఆమెతో నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేసాడు కరుణాకరన్..ఆ రషస్ ని ప్రభాస్ కి చూపించగా ఎందుకో ఆయన సంతృప్తి గా లేడు.
Also Read: Oke Oka Jeevitham OTT Release Date: ‘ఒకే ఒక జీవితం’ OTT విడుదల తేదీ వచ్చేసింది

హీరోయిన్ విషయం లో రిస్క్ చెయ్యడం ఎందుకు..ఈ అమ్మాయి ని తీసేసి కాజల్ అగర్వాల్ ని తీసుకోండి అని సూచించాడట ప్రభాస్..ఇక ఆ తర్వాత ఏమి జరిగిందో మన అందరికి తెలిసిందే..రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ తో ఇప్పటి వరుకు సినిమా చెయ్యలేదు..భవిష్యత్తులో కూడా వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా తెరకెక్కే అవకాశాలు చాలా తక్కువ.
Also Read: Rashmi Gautam: వాడుకొని వదిలేస్తారని ముందే తెలుసు… అన్నిటికీ ఇష్టపడే పరిశ్రమకు వచ్చిన రష్మీ!
[…] […]