Rashmi Gautam- Sudigali Sudheer: రష్మీ ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన ఎదురయ్యే ప్రశ్న… సుధీర్ తో మీకున్న అనుబంధం ఏమిటీ?. బుల్లితెర లవ్ బర్డ్స్ గా రష్మీ-సుధీర్ లను ప్రేక్షకులు భావిస్తారు. ఆడియన్స్ లో ఈ భావన కలిగించింది కూడా వారే. షోస్ లో సుధీర్, రష్మీ నాన్ స్టాప్ రొమాన్స్ కురిపించారు. వీరిద్దరిపై స్పెషల్ స్కిట్స్ రూపొందాయి. ఢీ వేదికగా రొమాంటిక్ సాంగ్స్ లో కలిసి కాలు కదిపారు. రెండుసార్లు సుధీర్-రష్మీలకు ఉత్తుత్తి వివాహం చేశారు. దీనికి తోడు ముప్పై ఏళ్ళు దాటిపోయినా ఇద్దరూ వివాహం చేసుకోవడం లేదు. ఈ పరిణామం కూడా సుధీర్, రష్మీ ప్రేమికులు అనే అనుమానాలకు కారణం అవుతుంది.

తాజాగా రష్మీ మరోసారి ఈ విషయంపై స్పందించారు. ఆమె లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో రష్మీ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. యాంకర్ సుధీర్ తో మీ రిలేషన్ ఏమిటని అడగ్గా… జీవితంలోని ప్రతి విషయం బయటకు చెప్పేస్తే అది జీవితమే కాదు. అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. సుధీర్ తో నాకున్న బంధం ఎలాంటిదైనా కావచ్చు, అది ఏంటనేది ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వ్యక్తిగత విషయాలు నాలోనే దాచుకుంటాను.
భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేను. ఏమైనా అది అందరికీ తే;తెలుస్తుంది. సుధీర్ నేను ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటామో అదే ఆన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. మాది పదేళ్ల ప్రయాణం. ఏదీ కావాలని చేయలేదు. అనుకోకుండా జరిగిపోయింది. సుధీర్ తో ఒక మ్యాజిక్ లా కెమిస్ట్రీ కుదిరింది. అది ప్రేక్షకులకు నచ్చింది, అన్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సుధీర్ ని మీరు ఆహ్వానించారా? అని అడగ్గా, నేను పిలవకపోయినా సుధీర్ వస్తాడు. ఆ ఈవెంట్ కి నందు సుధీర్ ని పిలిచారు అని రష్మీ చెప్పుకొచ్చారు.

మరోవైపు సుధీర్ కూడా ఇటీవల రష్మీతో ఎఫైర్ రూమర్స్ పై స్పందించారు. ఆయన లేటెస్ట్ మూవీ గాలోడు విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ క్రమంలో అతడు మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఎక్కడికి వెళ్లినా రష్మీ గురించే అడుగుతున్నారు. మా మధ్య స్నేహానికి మించి ఏమీ లేదు, ఏళ్ల తరబడి కలిసి పని చేయడం వలన జనాలు అలా భ్రమపడుతున్నారని సుధీర్ అన్నాడు. ఇక రష్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో గాలోడు కూడా విజయం సాధిస్తుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.