Allu Sirish: ఇటీవల కాలంలో ఓ సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలంటే మేకర్స్ చాలా ఎనర్జీ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఎన్ని ప్రయోగాలు చేసినా సినిమాపై ఇంప్రెస్ పడుతుంది తప్పా.. కమర్షియల్ గా ఆకట్టుకోవడం లేదు. కొందరు స్టార్ హీరోల సినిమాలను అభిమానులు ఒకటి, రెండు రోజులు సందడి చేసినా ఆ తరువాత నార్మల్ ఆడియన్స్ థియేటర్ వెళ్లకపోవడంతో పెట్టుబడులు కూడా రాని సినిమాలు ఉన్నాయి.

ఇప్పుడు అల్లు శిరీష్ సినిమాపై అదే భయం పట్టుకుంది. ఈ సినిమా మొదటిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సోమవారం సక్సెస్ మీట్ పెట్టి.. బన్నీని రప్పించి మరీ హైప్ క్రియేట్ చేశారు. అయితే సినిమాపై మంచి ఇంప్రెస్ వస్తోంది. కానీ కలెక్షన్లు మాత్రం అనుకున్నంతగా రాబట్టలేదనే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి లాస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఇలాగే మంచి టాక్ తెచ్చుకుంది. కానీ వీక్ పూర్తవగానే వసూళ్లు డల్లయ్యాయి. ఇప్పుడు ఆయన బాటలోనే అల్లు శిరీష్ సినిమా వెళ్తుందా..? అని చర్చించుకుంటున్నారు.
సాంప్రదాయ వారమైన ఈ శుక్రవారం అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో.. రాక్సాసివో..’ రిలీజైంది. సినిమాకు మొదటి నుంచి మీడియా సపోర్టు ఉంది. దీంతో పాటు కంటెంట్ కూడా బాగుందని టాక్ రావడంతో చాలా మంది సినిమా చూడ్డానికి మొదటి, రెండు రోజులు థియేటర్లోకి వెళ్లారు. వీరికి తోడు కాంతారా వెళ్లిన వారు కూడా అక్కడ టికెట్లు దొరక్కపోతే ఈ సినిమాకు వచ్చారు. ఈ పరిస్థితి చూసి ఈ సినిమా అనుకున్న రేంజ్ కు వెళ్తుందని అనుకున్నారు. కానీ వీకెండ్ డేస్ లో అసలైన వసూళ్లు రాబట్టేకపోయాయి. సోమవారం వరకు కోటిన్నర కూడా దాటలేదు.
ఈ తరుణంలో యశోద సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అంటే శుక్రవారం లోపై అనుకున్న కలెక్షన్లు రావాలి. కానీ అలా సాధ్యమవుతుందా..? అని అనుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ ఇలాగే మొదటి వీక్ చాలా సందడిగా సాగింది. కానీ ఆ తరువాత మేన్ వసూళ్లు కూడా కాలేదు. దీంతో సినిమా బాగున్నా కలెక్షన్లు మాత్రం అనుకున్న విధంగా రాకపోయేసరికి నిరాశపరిచినట్లయింది.

ఇప్పుడు అల్లు శిరీశ్ ‘ఊర్వశివో.. రాక్సాసివో’ కూడా చివరి వరకు నిరాశపరుస్తుందా..? అని అనుకుంటున్నారు. ఇప్పటికే సినిమాను అల్లు ఫ్యామిలీ అంతా కలిసి ప్రమోట్ చేశారు. సక్సెస్ మీట్ పెట్టి సందడి చేశారు. మరోవైపు సినిమా బాగుందన్న టాక్ వస్తోంది. కానీ పరిస్థితులు ఒకలా ఉన్నాయి. మిగతా సినిమాల పోటీకి తట్టుకుంటేనే ఈ సినిమా ముందుకు వెళ్తుంది. లేకుంటే సాధారణ వసూళ్లలాగే ఈ మూవీ మిగులుతుందా..? అని చర్చించుకుంటున్నారు.