Rashmi Gautam: రష్మీ గౌతమ్ యానిమల్ లవర్ అన్న విషయం తెలిసిందే. మనుషుల వలన ప్రాణులకు ఏ రూపంలో కూడా నష్టం జరగకూడదని ఆమె వీగన్ గా మారారు. అంటే మాంసాహారమే కాదు పాలు, పాల పదార్థాలు, బై ప్రొడక్ట్స్ కూడా రష్మీ తినరట. అలాగే సోషల్ మీడియా వేదికగా సేవ్ యానిమల్స్ ఉద్యమం నడుపుతోంది. మూగ జీవాలను కాపాడేందుకు చట్టాలు ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన వ్యవస్థలు ఉన్నాయి. ఎవరైనా జీవాలను హింసించినట్లు, ప్రాణాలు తీసినట్లు తన దృష్టికి వస్తే రష్మీ వెంటనే స్పందిస్తారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారు.

ఇక సంక్రాంతి పండగ వేళ భారీ ఎత్తున జంతు వధ చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాలు విపరీతంగా జరుగుతాయి. కోడి పందాల్లో అంతులేని వైలెన్స్ జరుగుతుంది. కోడి పుంజుల కాళ్ళకు కత్తులు కట్టి కొట్లాటకు వదులుతారు. దీనిపై నిషేధం ఉంది.అయితే ఇది సనాతన సాంప్రదాయం, జనాల సెంటిమెంట్ గా ఉంది. మంచి చెప్పినా ఎవడూ వినడు. తప్పని పందాలు ఆపేస్తే ప్రజాగ్రహానికి గురి కావలసి వస్తుంది. అందుకే ప్రజా ప్రతినిధులు మద్దతు ఇస్తారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తారు.
కోడి పందాలపై రష్మీ గౌతమ్ రియాక్ట్ అయ్యారు. ఓ వ్యక్తి కోడి పందెంలో గెల్చినట్లు, మజా అనుభవించినట్లు సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తప్పుబట్టిన రష్మీ.. హింసను ప్రమోట్ చేస్తున్నారంటూ మండిపడింది. అయితే ఈ పోస్ట్ మిక్స్డ్ ఒపీనియన్స్ కి దారి తీసింది. కొందరు ఆమెను సమర్ధించగా… చాలా మంది విమర్శించారు. తమిళనాడులో జల్లికట్టు కూడా వైలెన్సే, వెళ్లి వాళ్లకు చెప్పు చెప్పుతో కొడతారని ఒకరు కామెంట్ చేశారు.

మరొక నెటిజెన్… ఆపు నీ పతివ్రత కథలు… నీ ఎక్స్ పోజింగ్ కూడా వైలెన్సే . ఎంత మంది కుర్రాళ్ల గుండెలకు గాయాలు అవుతున్నాయో తెలుసా, అని సెటైర్ వేశాడు. సోషల్ మీడియా జనాలు అసలు పాయింట్ పక్కన పెట్టి, రష్మీ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ని టార్గెట్ చేస్తున్నారు. దేశం నుండి బ్రిటీషర్స్ ని తరిమేసిన గాంధీజీ మనుషుల మనసుల నుండి హింసను దూరం చేయలేకపోయారు. అలాంటిది రష్మీ ఎంత. ఆమె ప్రయత్నం ఎంతో కొంత మందిని మార్చగలేదేమో కానీ… పూర్తిగా సొసైటీని మార్చేయడం రష్మీ వల్ల కాని వ్యవహారం.
నువ్వు నీ పతి వ్రత కథలు….నువ్వు చేసే ఎక్స్పోజింగ్ గురుంచి చెప్పు బేబీ,అది ఎంత మంది యువత హృదయాలు దెబ్బ తింటున్నయు 😆😆😆😆
— satish k (@ksatishkumar555) January 15, 2023