Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam: వాడుకొని వదిలేస్తారని ముందే తెలుసు... అన్నిటికీ ఇష్టపడే పరిశ్రమకు వచ్చిన రష్మీ!

Rashmi Gautam: వాడుకొని వదిలేస్తారని ముందే తెలుసు… అన్నిటికీ ఇష్టపడే పరిశ్రమకు వచ్చిన రష్మీ!

Rashmi Gautam: సినిమా ఒక అయస్కాంతం. ప్రతి ఒక్కరినీ తన వైపుకు లాగేసుకుంటుంది. సినిమా వల్ల వచ్చే సంపాదన, లగ్జరీ లైఫ్, హోదా, పేరు, కీర్తి అటు వైపు అడుగులు వేసేలా చేస్తాయి. ఎలాగైనా హీరోనో, హీరోయినో అయితే లైఫ్ మారిపోతుందని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అలా వేయి ఆశలతో పరిశ్రమలో అడుగుపెట్టిన అమ్మాయిల్లో రష్మీ గౌతమ్ ఒకరు. చాలా మందికి రష్మీ యాంకర్ గానే తెలుసు కానీ ఆమె ప్రస్థానం మొదలైంది నటిగా. హీరోయిన్ కావాలని ఇండస్ట్రీకి వచ్చిన రష్మీకి చిన్న చిన్న అవకాశాలు వచ్చాయి. ఆమె హీరోయిన్స్ ఫ్రెండ్, కాలేజ్ స్టూడెంట్, ఆఫీస్ లో ఎంప్లాయ్ వంటి పాత్రలు చేశారు. హోలీ, కరెంట్, ఎవరైనా ఎపుడైనా, బిందాస్, ప్రస్థానం తో పాటు అనేక చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రలు చేశారు.

Rashmi Gautam
Rashmi Gautam

పరిశ్రమకు వచ్చి పదేళ్లు అవుతున్నా ఆమెకు హీరోయిన్ గా అవకాశం రాలేదు. దీంతో యాంకరింగ్ వైపు అడుగులు వేశారు. 2013లో మొదలైన జబర్దస్త్ షోలో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ షో యాంకర్ గా ఉన్న అనసూయ తప్పుకోవడంతో రష్మీకి అవకాశం వచ్చింది. అదే ఆమె కెరీర్ లో కీలక మలుపు అయ్యింది. జబర్దస్త్ షో రష్మీ ఫేట్ మార్చేసింది. జబర్దస్త్ కామెడీ షోగా అత్యంత్య పాపులారిటీ తెచ్చుకోగా…. యాంకర్ రష్మీ కూడా అదే స్థాయిలో ఫేమ్ తెచ్చుకున్నారు.

Also Read: Oke Oka Jeevitham OTT Release Date: ‘ఒకే ఒక జీవితం’ OTT విడుదల తేదీ వచ్చేసింది

జబర్దస్త్ తెచ్చిపెట్టిన క్రేజ్ హీరోయిన్ కావాలన్న ఆమె కోరిక తీర్చింది. ఆమెకు వరుసగా హీరోయిన్ ఆఫర్స్ వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని బోల్డ్ రోల్స్ కూడా చేశారు. గుంటూరు టాకీస్ రష్మీకి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చింది. ఆ మూవీలో రష్మీ హాట్ సన్నివేశాల్లో నటించారు. స్కిన్ షో విషయంలో కూడా మొహమాటం లేకుండా రష్మీ నటించారు. గుంటూరు టాకీస్, రాణి గారి బంగ్లా, తను వచ్చెనంట, నెక్స్ట్ నువ్వే, అంతకు మించి… ఇలా వరుసగా అరడజనుకు పైగా చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించారు.

Rashmi Gautam
Rashmi Gautam

అయితే ఆమెకు స్టార్స్ పక్కన అవకాశాలు రాలేదు. దానికి కారణం ఆమె యాంకర్ కావడమే. ఓ తరహా చిత్రాలకు మాత్రమే ఆమెను కన్సిడర్ చేస్తున్నారు. ఈ మధ్య ఆ మాత్రం అవకాశాలు కూడా రావడం లేదు. కారణం రష్మీ హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. గుంటూరు టాకీస్ మాత్రమే ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే పరిశ్రమకు వచ్చే ముందే రష్మీకి ఇవ్వన్నీ తెలుసు. అవసరం మేరకే వాడుకొని వదిలేస్తారని తెలిసే పరిశ్రమకు వచ్చింది. ఇది మాత్రమే చేస్తానంటే కుదరదని కూడా తెలుసు… అందుకే అంది వచ్చిన అవకాశాలు కాదనకుండా చేస్తూ దూసుకుపోతుంది.

Also Read: Nayanthara Pregnant: తల్లి కాబోతున్న నయనతార..వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version