Homeఎంటర్టైన్మెంట్Oke Oka Jeevitham OTT Release Date: 'ఒకే ఒక జీవితం' OTT విడుదల తేదీ...

Oke Oka Jeevitham OTT Release Date: ‘ఒకే ఒక జీవితం’ OTT విడుదల తేదీ వచ్చేసింది

Oke Oka Jeevitham OTT Release Date: వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న శర్వానంద్ కి ఇటీవల విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా అతని కెరీర్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..శర్వానంద్ కి సరైన సమయం లో సరైన చిత్రం గా ఈ సినిమా నిలిచింది..టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తల్లి సెంటిమెంట్ ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమా లో శర్వానంద్ కి తల్లి గా అక్కినేని అమల గారు నటించారు..ఇక శర్వానంద్ స్నేహితులుగా వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి నటించారు..వీళ్లిద్దరికీ కూడా చాలా కాలం తర్వాత అద్భుతమైన పాత్రలు దక్కింది అనే చెప్పాలి..కేవలం 9 కోట్ల రూపాయిలు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్నఈ చిత్రం ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టి ఇప్పటికి కూడా వీకెండ్స్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను దక్కించుకుంటుంది..ఫుల్ రన్ లో 11 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.

Oke Oka Jeevitham OTT Release Date
Sharwanand

థియేట్రికల్ పరంగా మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమాకి డిజిటల్ స్ట్రీమింగ్ కి మాములు డిమాండ్ లేదనే చెప్పాలి..ఎప్పుడెప్పుడు ఈ సినిమా OTT లోకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తూ ఉన్నారు..ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సోనీ లివ్ సంస్థ వారు భారీ రేట్ కి కొనుగోలు చేసారు..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 9 వ తేదీ నుండి సోనీ లివ్ లో అందుబాటులోకి రాబోతుందని తెలుస్తుంది.

Also Read: Nayanthara Pregnant: తల్లి కాబోతున్న నయనతార..వైరల్ అవుతున్న లేటెస్ట్ పోస్ట్

Oke Oka Jeevitham OTT Release Date
Sharwanand

థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా OTT లో ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంటుందో చూడాలి..ఇక ఈ సినిమా తర్వాత శర్వానంద్ చెయ్యబొయ్యే సినిమాల గురించి ఎలాంటి క్లారిటీ లేదు..స్క్రిప్ట్ సెలక్షన్ విషయం లో ఆయన ఆచి తూచి అడుగులు వెయ్యాలి అని చూస్తున్నాడు..ఎందుకంటే ‘ఒకే ఒక జీవితం’ సినిమాకి ముందు శర్వానంద్ కి వరుసగా 6 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వచ్చాయి..అందుకే ఆయన ఇక నుండి సినిమాల ఎంపికలో ఆలస్యం అయినా మంచి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకి వచేందుకు చూస్తున్నాడు.

Also Read: BiggBoss 6 Telugu Nominations: బిగ్ బాస్ 4వ వారం: ఈ వారం అత్యధికంగా 9మంది నామినేట్.. మళ్లీ రేవంత్ టార్గెట్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version