Telugu News » Entertainment » Rashmi gautam looks beautiful in purple color dress mind black if you look at that back
Ad
Rashmi Gautam : పర్పుల్ కలర్ డ్రెస్ లో రష్మీ గౌతమ్ పరువాల జాతర… ఆ బ్యాక్ చూస్తే మైండ్ బ్లాక్
మరో వైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో విందు ఇస్తుంది. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. రష్మీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.
Rashmi Gautam : బుల్లితెర స్టార్ గా వెలుగొందుతుంది రష్మీ గౌతమ్. ఈ స్టార్ యాంకర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యాంకరింగ్ లో ట్రెండ్ సెట్టర్. తెలుగు యాంకర్స్ అంటే నిండుగా బట్టలు వేసుకోవాలి, స్కిన్ షో చేయకూడదనే రూల్స్ బ్రేక్ చేశారు. జబర్దస్త్ యాంకర్స్ గా అనసూయ, రష్మీ గ్లామరస్ యాంకర్స్ అనే ట్రెండ్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో వీరి డ్రెస్సింగ్ పలుమార్లు విమర్శలపాలైంది. ముఖ్యంగా అనసూయ విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అయితే ఐ డోంట్ కేర్ అంటూ, అనసూయ విమర్శలను కొట్టిపారేశారు.
రష్మీ నటిగా పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆమె హీరోయిన్ కావాలనుకున్నారు. అయితే సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కాయి. హీరోయిన్ ఫ్రెండ్, స్టూడెంట్ వంటి పెద్దగా ప్రాధాన్యత లేని రోల్స్ చేసింది. హీరోయిన్ కావడం కష్టమనుకుని యాంకరింగ్ వైపు అడుగులు వేసింది. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ మొదలైంది. అనసూయ యాంకర్ గా ఎంపికైంది. కొన్నాళ్ల తర్వాత అనసూయ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. అది రష్మీకి మేలు చేసింది. ఆమెకు ఛాన్స్ దక్కింది.
ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ అయ్యాక అనసూయ కూడా వచ్చారు. జబర్దస్త్ ట్రెమండస్ సక్సెస్ కాగా రష్మీ ఫేట్ మారిపోయింది. హీరోయిన్ గా నిర్మాతలు ఆఫర్స్ ఇచ్చారు. పదికి పైగా చిత్రాల్లో రష్మీ హీరోయిన్ గా నటించింది. అయితే ఒక్క చిత్రం కూడా హిట్ కాలేదు. అది మైనస్ అయ్యింది. ఈ మధ్య ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. చేసేది లేక యాంకర్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తోంది.
ఇక రష్మీ మ్యారేజ్ ఎవర్ గ్రీన్ టాపిక్. థర్టీ ప్లస్ లో ఉన్న రష్మీని పెళ్లెప్పుడంటే దానికి ఇంకా సమయం ఉందంటుంది. మరో బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ తో రష్మీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కురిపించింది. వీరు క్రేజీ లవర్స్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే అది ప్రొఫెషన్ వరకు మాత్రమే, బయట జస్ట్ ఫ్రెండ్స్ అంటారు. వీరి రిలేషన్ పై కన్ఫ్యూషన్ ఉంది. మరో వైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్స్ తో విందు ఇస్తుంది. తాజాగా పర్పుల్ కలర్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది. రష్మీ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.