Rashmi Gautam: రష్మీ గౌతమ్ అదృష్టాన్ని చూసి జనాలు కుళ్ళుకుంటున్నారు. లైఫ్ అంటే ఇదిరా అంటూ నొచ్చుకుంటున్నారు. రష్మీ తన సరదాలు, సంతోషాల తాలూకు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటే మనకు ఇలా భోగాలు అనుభవించే ఛాన్స్ లేదని బాధపడుతున్నారు కొందరు. రష్మీ వెకేషన్ ఫోటోలు ఆ రేంజ్ లో ఉన్నాయి. బికినీలో జలకాలాడుతూ తిండి ఆరగిస్తుంది. ఇటీవల రష్మీ మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లారు. మాల్దీవ్స్ అంటే చెప్పేదేముంది. అందమైన దీవులు, ఎటు చూసినా నీరు.

మాల్దీవ్స్ వెళితే కచ్చితంగా బికినీ వేయాల్సిందే తారలు. బికినీలు, స్విమ్ షూట్స్ లో ఈత కొడితే వచ్చే సరదానే వేరు. అందుకే అక్కడికెళ్లిన ప్రతి ఒక్కరూ ఆ సరదా తీర్చుకుంటారు. రష్మీ సైతం బికినీ ధరించి స్విమ్ చేస్తుంది. ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. 2020 తర్వాత ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఇలా ఉంటుందని చెప్పుకొచ్చింది.

దాదాపు రెండేళ్లు జనాలు కాలు కదపడానికి లేకుండా పోయింది. కరోనా మహమ్మారితో మరో దేశం కాదు కదా పల్లెటూళ్ళో పక్క స్ట్రీట్ కి వెళ్లలేని దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలల తరబడి ఇళ్లకే పరిమితమైన సెలెబ్రిటీలు సాధారణ పరిస్థితులు వచ్చాక వెకేషన్స్ కి క్యూ కట్టారు. అదేం విచిత్రమో కానీ ప్రతి ఒక్క సెలెబ్రిటీ ఫేవరేట్ వెకేషన్ స్పాట్ మాల్దీవ్స్ కావడం విశేషం. ఆ దీవుల దేశం వెళ్లేందుకు ఎగబడుతున్నారు. కొందరైతే రెండు సార్లు అక్కడికి ట్రిప్ పూర్తి చేశారు.

రష్మీకి షూటింగ్స్ నుండి కాస్త గ్యాప్ దొరికినట్లుంది. ఫ్రెండ్స్ తో పాటు హ్యాపీగా చెక్కేసింది. ఇక రష్మీ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ మూవీ బొమ్మ బ్లాక్ బస్టర్. నందు హీరోగా నటించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అలాగే రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి వరకు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ రెండింటికి యాంకర్ గా ఉన్నారు. సౌమ్య రావు యాంకర్ గా రావడంతో రష్మీపై వేటు పడింది. అయినప్పటికీ లక్షల సంపాదనతో రష్మీ దూసుకుపోతుంది.