
Anchor Rashmi : రష్మీ గౌతమ్ వయసు 34 ఏళ్ళు. అంటే పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఆపై ఎఫైర్ రూమర్స్. రష్మీ పెళ్ళెప్పుడు చేసుకుంటారనేది హాట్ టాపిక్ గా ఉంది. రష్మీ యాంకర్ కమ్ హీరోయిన్. ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆరాధించే అభిమానులు ఉన్నారు. రష్మీ యాంకర్ గా ఉన్న బుల్లితెర షోలు సూపర్ సక్సెస్. ఆమె గ్లామర్ కి అలవాటు పడ్డ అభిమానులు లక్షల్లో ఉన్నారు. ఈ క్రమంలో రష్మీ వ్యక్తిగత విషయాలపై సాధారణంగానే ఆసక్తి ఉంటుంది.

జబర్దస్త్ షో ద్వారా రష్మీ ఫేమ్ తెచ్చుకున్నారు. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన రష్మీకి అవకాశాలు రాలేదు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేశారు. హీరోయిన్ అవుతానన్న ఆశలు సన్నగిల్లడంతో జబర్దస్త్ యాంకర్ అయ్యారు. అనూహ్యంగా యాంకర్ గా వచ్చిన క్రేజ్ ఆమె హీరోయిన్ కావాలన్న కలను నిజం చేసింది.

కాగా సుడిగాలి సుధీర్ ని రష్మీ ప్రేమిస్తున్నారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వీరిద్దరూ బుల్లితెరపై నాన్ స్టాప్ రొమాన్స్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఏళ్ల తరబడి ఢీ, జబర్దస్త్ షోలలో రష్మీ-సుధీర్ ప్రేక్షకులను తమ లవ్ ట్రాక్స్ తో అలరించారు. మరి నిజంగా సుధీర్ ని మీరు ప్రేమిస్తున్నారా? అంటే ఆమె వద్ద స్పష్టమైన సమాధానం లేదు. ఒకసారి ఫ్రెండ్ అంటుంది, మరోసారి మా మధ్య బంధం ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదంటుంది.

కాగా ఆమె తాజా సోషల్ మీడియా పోస్ట్ పలు అనుమానాలు కలిగిస్తుంది. బ్లాక్ శారీ ధరించిన రష్మీ గౌతమ్ సూపర్ హాట్ ఫోజులతో ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. సదరు ఫోటోలకు ఆమె ఇచ్చిన కామెంట్ అనుమానాస్పదంగా ఉంది. 19-02-2023 డేట్ తో పాటు లవ్ ఎమోజీలు పోస్ట్ చేసింది. ఆ తేదీ తన జీవితంలో చాలా కీలకం అన్నట్లు రష్మీ పోస్ట్ ఉంది. అదే సమయంలో లవ్ ఎమోజీలు జోడించగా.. రష్మీ ప్రేమికుడిని లేదా కాబోయేవాడిని పరిచయం చేయబోతున్నారంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు రష్మీ గౌతమ్ బుల్లితెరపై జోరు చూపిస్తున్నారు. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టాప్ రేటెడ్ షోలలో యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే స్టార్ మా లో ఓ షో చేస్తున్నారు. నటిగా మాత్రం ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. ఒక దశలో రష్మీ వరుస చిత్రాలు చేశారు. అయితే ఆమె నటించిన చిత్రాలేవీ ఆడలేదు. హిట్ పెర్సెంటేజ్ లేకపోవడంతో నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు.గత ఏడాది బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.