
Pyaar Lona Paagal – Lyrical : రవితేజ ను ఫరియా అబ్దుల్లా మోసం చేసింది. ప్రేమించి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో రవితేజ మద్యానికి బానిస అయ్యాడు. తాగింది ఎక్కువ కావడంతో ఆ మత్తులో పాటలు పాడుతున్నాడు. ఇదేదో నిజ జీవితంలో అనుకునేరు.. రవితేజ హీరోగా, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్ హీరోయిన్లుగా, సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే చిత్రం నిర్మితమవుతోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ నామ, రవితేజ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక పాట విడుదలైంది.. ఇక శివరాత్రి సందర్భంగా ప్యార్ లోన పాగల్ అనే పాటను విడుదల చేశారు.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాట పూర్తి మాస్ బీట్ తో ఉంది. హరిచంద్ర రామేశ్వర్ ఈ పాటకు ఊర మాస్ బాణీలు సమకూర్చారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్తుంటే తాగుబోతుగా మారిన ఓ ప్రేమికుడు ఎలాంటి విరహవేదనను అనుభవిస్తాడో నేపథ్యంగా ఈ పాట రాసినట్టు తెలుస్తోంది. ట్యూన్స్ కూడా మాస్ ప్రేక్షకులు ఇష్టపడే విధంగా రూపొందించారు. ఏక్ బార్, దోబార్, తీన్మార్ కలిపి ట్యూన్స్ కొట్టారు.. అవి చెవులకు ఇంపుగా ఉన్నాయి..
ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.. ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. అందులో రవితేజ మాస్ గెటప్ తో కనిపిస్తున్నారు. ఆయన ఎనర్జీ లెవెల్స్ కూడా సూపర్ గా ఉన్నాయి. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది..ఈ సినిమా రివెంజ్ డ్రామా కథాశంతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే శ్రీకాంత్ వీసా సమకూర్చుతున్నారు.
