NTR: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ ప్రస్తుతం కూల్ అయ్యాడు. ఎలాగూ ఆర్ఆర్ఆర్ రిలీజ్ ముగిసింది. అందుకే.. తారక్ ప్రస్తుతం ఇక తన కొత్త సినిమా పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది అని బయట బాగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ మాత్రం ఫుల్ హ్యాపీగా లేడు. అందుకే, తన నెక్స్ట్ సినిమా విషయంలో […]
NTR: ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ ప్రస్తుతం కూల్ అయ్యాడు. ఎలాగూ ఆర్ఆర్ఆర్ రిలీజ్ ముగిసింది. అందుకే.. తారక్ ప్రస్తుతం ఇక తన కొత్త సినిమా పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. నిజానికి ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ కి అన్యాయం జరిగింది అని బయట బాగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే.. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ మాత్రం ఫుల్ హ్యాపీగా లేడు.
Jr NTR
అందుకే, తన నెక్స్ట్ సినిమా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని ఎన్టీఆర్ చేయబోతున్నాడు. ఈ సినిమా పై ఇప్పటికే ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ ఉంది. పైగా ఈ సినిమా కోసం కొరటాల భారీ తారాగణాన్ని తీసుకోబోతున్నాడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరోని విలన్ గా నటింపజేయడానికి ఎన్టీఆర్ టీమ్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.
ఆర్ఆర్ఆర్ వల్ల హిందీలో ఎన్టీఆర్ కి గుర్తింపు అయితే వచ్చింది గానీ, ఆ స్థాయిలో మార్కెట్ క్రియేట్ కాలేదు. అందుకే కొరటాలతో చేయబోయే సినిమాతో ఫుల్ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా హీరో సైఫ్ అలీ ఖాన్ ను తన సినిమాలో విలన్ గా నటించాలని ఎన్టీఆర్ కోరాడట. మరి చూడాలి ఈ కలయికలో ఏ రేంజ్ హిట్ వస్తోందో.
ఇక ఈ సినిమాలో తారక్ కి హీరోయిన్ గా అలియా భట్ తో పాటు మరో హీరోయిన్ ను కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22, 2022న ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయాలని ఇప్పటికే షెడ్యూల్ ను కూడా ఫిక్స్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఆ మధ్య అయితే.. ఈ సినిమా గురించి కొరటాల ట్వీట్ చేస్తూ..’లాస్ట్ టైం లోకల్ పరిధిలో రిపేర్ చేసాము, ఈ సారి ఫర్ చేంజ్ బోర్డర్స్ ను కూడా దాటబోతున్నాము’ అంటూ కొరటాల ఈ సినిమా స్థాయి గురించి పోస్ట్ చేసిన మెసేజ్ అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.
Jr NTR
ఇక ఎలాగూ.. ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కొరటాల ఈ చిత్రం కోసం బలమైన నేపథ్యాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.