Rashi Khanna: హీరోయిన్లు సైడ్ ఇన్ కమ్ కోసం అసలు ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవడం లేదు. ఎక్కడ నాలుగు రూపాయలు వస్తాయో.. అక్కడకి వెళ్లిపోతున్నారు. నేటి మహానటి కీర్తి సురేష్ సైడ్ బిజినెస్ కోసం కొత్త దారులు ఎంచుకున్న క్రమంలో కీర్తి సురేశ్ కొత్తగా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో హీరోయిన్ రాశీఖన్నా కూడా అదే బాటలో నడిచింది. సొంత యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించినట్లు రాశీఖన్నా అధికారికంగా ప్రకటించింది.

తన నిజ జీవితం గురించి, రోజువారీ కార్యకలాపాలు, ఆహారపు అలవాట్లు, చిన్ననాటి జ్ఞాపకాలు, మేకప్ రహస్యాలు, ప్రయాణ డైరీలు మరియు ఇతర అంశాలను ఈ ఛానల్ లో పంచుకుంది. దాంతో సొంత యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన మరో హీరోయిన్ అంటూ రాశి ఖన్నా పేరు ఈ రోజు బాగా వైరల్ అయింది. పైగా రాశి ఖన్నా తన యూట్యూబ్ ఛానెల్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
Also Read: పేరుకు పెద్దమనిషి.. అతని నీచబుద్ధి వల్ల బాలిక ఆత్మహత్య..
ఆమె మాటల్లోనే.. ‘నా అధికారిక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సబ్‌స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి’ అని చెప్పుకొచ్చింది రాశి. పైగా తన ఫోటోలము సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక నుంచి రాశి ఖన్నా తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్నెస్ తదితర వీడియోలను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య యూట్యూబ్ ఛానెల్ ద్వారా కూడా సినీ తారలు బాగా సంపాదిస్తున్నారు. అందుకే.. డబ్బులు వస్తున్నాయి కదా.. ఎందుకు ఇక మొహమాటం పడటం అని ప్రతి హీరోయిన్ యూట్యూబ్ లో రెచ్చిపోవడానికి సిద్ధం అయ్యారు.
Also Read: ఆర్ఆర్ఆర్ రాజీనామా వెనుక అసలు కారణమిదే…!