https://oktelugu.com/

Rashi Khanna Clarity About Her Comments: హే.. నా తల్లి వల్ల నిర్మాతలకు ఏంటి సమస్య ?

Rashi Kanna Clarity About Her Comments: బబ్లీ హీరోయిన్ రాశి ఖ‌న్నాకి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకే, ఈ బబ్లీ బ్యూటీ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది. కాకపోతే, ఈ మధ్య రాశి ఖన్నా లైంలైట్ లో లేదు. కరోనా తర్వాత బాగా ఫేడ్ అవుటైన హీరోయిన్లలో ఒకరిగా మిగిలిపోయింది. అంతకుముందు ఒకటో రెండో పెద్ద సినిమాలు దక్కేవి రాశి […]

Written By:
  • Shiva
  • , Updated On : April 7, 2022 / 05:09 PM IST
    Follow us on

    Rashi Kanna Clarity About Her Comments: బబ్లీ హీరోయిన్ రాశి ఖ‌న్నాకి టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ ఉంది. ఇక ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోంది. అందుకే, ఈ బబ్లీ బ్యూటీ ఎలాగోలా కెరీర్ ను నెట్టుకొస్తూనే ఉంది. కాకపోతే, ఈ మధ్య రాశి ఖన్నా లైంలైట్ లో లేదు. కరోనా తర్వాత బాగా ఫేడ్ అవుటైన హీరోయిన్లలో ఒకరిగా మిగిలిపోయింది.

    Rashi Kanna Clarity About Her Comments

    అంతకుముందు ఒకటో రెండో పెద్ద సినిమాలు దక్కేవి రాశి ఖ‌న్నాకి. కానీ, ఇప్పుడు రాశి ఖ‌న్నాని ప్రధాన పాత్రలకు తీసుకునే ఆలోచనలో లేరు ఫిలిం మేకర్స్. స్టార్ డైరెక్టర్లతో చనువుగా ఉన్నా.. ఈ బ్యూటీకి మాత్రం ఛాన్స్ లు దక్కడం లేదు. సాయి తేజ్, గోపీచంద్ లాంటి హీరోల సినిమాల్లో కూడా కొత్తగా ఛాన్స్ లు వచ్చే పరిస్థితి లేదు.

    మొత్తమ్మీద రాశి ఖ‌న్నా కూడా ఇక తనకు హీరోయిన్ పాత్రలు రావు అని అర్థం చేసుకుంది. అందుకే.. ఫలానా హీరోయిన్ రోల్స్ మాత్రమే కావాలి అని పట్టుబట్టకుండా వచ్చిన సినిమా అవకాశాలను, ఇతర ఆదాయ మార్గాలను అందిపుచ్చుకొని ఆ రకంగా ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం ఆమె చైతు హీరోగా రూపొందుతోన్న సినిమాలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది.

    అయితే, రాశి ఖ‌న్నా నాలుగేళ్ళ క్రితం వరకూ ఫుల్ ఫామ్ లో ఉందని.. కానీ, సడెన్ గా కరోనా తర్వాత ఆమెకు అసలు అవకాశాలే రాలేదు అని తెలుస్తోంది. అయితే, రాశి ఖ‌న్నాకి ఆమె తల్లి వల్లే అవకాశాలు తగ్గాయి అనేది ఒక వాదన ఉంది. కానీ, రాశి ఖ‌న్నా మాత్రం అలాంటి కామెంట్స్ ని పట్టించుకోవడం లేదు.

    Rashi Kanna Clarity About Her Comments

    పైగా తనకు తన తల్లి వల్లే ఆఫర్లు రావట్లేదు అన్న మాటని అస్సలు నమ్మడం లేదు. తన తల్లిని తన సినిమా సెట్స్ కి తీసుకొస్తూనే ఉంది రాశి ఖ‌న్నా. ఆమె కెరీర్ లో తన తల్లి పాత్ర చాలా ఉందట. హే.. నా తల్లి వల్ల నిర్మాతలకు ఏంటి సమస్య ? అని ప్రశ్నిస్తోంది. సమస్యలు చాలా ఉన్నాయనేది నిర్మాతల మాట. మరి చూడాలి.. రాశి ఖ‌న్నా ఏమి చేస్తోందో !!

    Tags