https://oktelugu.com/

Hero Ram: గాయం నుంచి కోలుకున్న రామ్​.. సెట్స్​లో అడుగుపెట్టేది ఎప్పుడంటే?

Hero Ram: తెలుగు సినీ పరిశ్రమలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ జోష్​లో కొనసాగుతున్న హీరో రామ్​ పోతినేని. ఈ సినిమాతో ఘన విజయం సాధించిన రామ్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్లిపోతున్నారు. కాగా, కొన్ని నెలల క్రితం రామ్​ తన కొత్త ప్రాజెక్ట్​ #RAPO19  షూటింగ్​ స్పాట్​లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రమాదం  కారణంగా రామ్ మెడకు గాయమైన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా అధికారికంగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 19, 2021 / 10:44 AM IST
    Follow us on

    Hero Ram: తెలుగు సినీ పరిశ్రమలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ జోష్​లో కొనసాగుతున్న హీరో రామ్​ పోతినేని. ఈ సినిమాతో ఘన విజయం సాధించిన రామ్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్లిపోతున్నారు. కాగా, కొన్ని నెలల క్రితం రామ్​ తన కొత్త ప్రాజెక్ట్​ #RAPO19  షూటింగ్​ స్పాట్​లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రమాదం  కారణంగా రామ్ మెడకు గాయమైన ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం కూడా అధికారికంగా ప్రకటించి.. కొన్ని నెలల పాటు షూటింగ్​ వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

    తమ హీరో త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించారు. కాగా, తాజాగా, రామ్​ గాయం నుంచి కోలుకున్నట్లు సమాచారం. దాదాపు 4 నెలల తర్వాత తిరిగి సెట్స్​లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, వచ్చే ఏడాది జనవరి 5 నుంచి షూటింగ్​ మొదలు పెట్టనున్నట్లు మేకర్స్ తెలిపారు.

    ఈ క్రమంలోనే హైదరాబాద్​లో తన అభిమానులతో కలిసి సమావేశమయ్యారు రామ్​. తాను కోలుకున్న తర్వాత కలుస్తానని హామీ ఇచ్చారని.. అందుకే మాటకు కట్టుబడి రామ్ ముందుగా అభిమానులను కలుసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తన కోసం అభిమానులు చేయించిన న్యూ క్యాలెండర్​ను ఆవిష్కరించారు రామ్​. కాగా, జనవరిలో ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్​ను శరవేగంగా పూర్తి చేయనున్నారట. ఈ సినిమాకు లింగు స్వామి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఉప్పెన ఫేమ్ హీరోయిన్​ కృతి శెట్టి ఇందులో హీరోయిన్​గా కనిపించనుంది.