Minister KTR: కంటోన్మెంట్ ప్రాంతంపై రాజకీయ దృష్టి పడుతోంది. దాన్ని అభివృద్ధి చేయండి లేకపోతే రాష్ర్టంలో విలీనం చేయాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించడంతో ఇప్పుడు రాజకీయం కొత్త దారిలో వెళుతోంది. మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా కంటోన్మెంట్ పై ప్రకటన చేయడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. అకస్మాత్తుగా కేటీఆర్ కు అంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ర్టంలో ఎన్నో ప్రాంతాలున్నా కంటోన్మెంట్ ప్రాంతాన్నికేటీఆర్ ఎంచుకోవడంలో కారణాలేంటి అని చర్చలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అన్ని దారులను వెతుకుతోంది. ఇందులో భాగంగానే కేంద్రం ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
కంటోన్మెంట్ ప్రాంతంపై మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాజ్ నాథ్ సింగ్ లకు ట్వీట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. కంటోన్మెంట్ లో 21 రహదారులను మూసి వేశారని, దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.న దీనిపై పట్టించుకోవాలని ఆకాంక్షించారు. అధికారుల తీరుతో అందరు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని స్పందించాలని కోరారు.
Also Read: కేసీఆర్.. బీజేపీని ఓడించగలడా?
దీంతో అక్కడ అభివృద్ధి పనుల నిర్వహణ కూడా సక్రమంగా జరగడం లేద. దీంతో మంత్రి కేటీఆర్ ట్వీట్ పై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధిపై పట్టించుకోవాలి. లేకపోతే ఎక్కడి సమస్యలు అక్కడే ఉండే అవకాశం ఉన్నందున పాలకులు స్పందించాలి. కంటోన్మెంట్ ప్రాంతంపై తక్షణమే సరైన నిర్ణయం తీసుకుని ప్రజలు బాధలు తీర్చాల్సిన అవసరాన్ని గుర్తించాలని అడుగుతున్నారు.
కంటోన్మెంట్ ప్రాంతం గురించి అందరు బాధ్యతగా వ్యవహరించి దాని అభివృద్ధికి మార్పులు తీసుకురావాలి. ప్రజల బాధలు గమనించి అక్కడ జరిగే పనుల నిర్వహణకు సహకరించాలి. లేకపోతే నగరం మధ్యలో ఉన్నా పనులు జరగకపోతే అభివృద్ధి కనిపించదు. దీంతో దీనిపై కేంద్రం స్పందించి కేటీఆర్ కోరినట్లుగా సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
Also Read: తెలంగాణలో మరోసారి ముందస్తు ఎన్నికలు?