Bigg Boss Telugu 5 Winner: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మరికొద్ది గంటల్లో ప్రసారం కానుంది. హోస్ట్ నాగార్జున ఫైనల్ కోసం బాలీవుడ్, టాలీవుడ్ కి చెందిన టాప్ సెలబ్రిటీలను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ స్టార్ క్యాస్ట్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ తో పాటు శ్యామ్ సింగరాయ్ టీమ్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి వేదిక పంచుకోనున్నారట. అయితే ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా.. ఆసక్తికర విషయాలు లీక్ కావడం జరిగింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం.

కాగా బిగ్ బాస్ సీజన్ 5లో ఫైవ్ లో కూడా సీజన్ 4 సీన్ రిపీట్ అయినట్లు తెలుస్తుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరిన సింగర్ శ్రీరామ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇచ్చారట. ఆయన నాగార్జున ఆఫర్ తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నారట. సీజన్ 4 ఫైనల్ లో హారిక, అరియానా ఎలిమినేషన్ అనంతరం టైటిల్ కోసం అభిజీత్, అఖిల్, సోహైల్ పోటీపడ్డారు. అయితే ఈ దశలో టైటిల్ గెలుస్తామనే నమ్మకం లేనివారు రూ. 25 లక్షలు తీసుకొని వెళ్లిపోవచ్చని ఒక ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ ని సోహైల్ అంగీకరించడం జరిగింది. రూ. 25 లక్షలతో ఆయన రేసు నుండి తప్పుకున్నారు.
Also Read: మిగిలింది రెండు రోజులే… సర్వేలు ఏం తేల్చాయి?
ఇక నేటి బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ లో ఇలాంటి సంఘటనే జరిగిందట. సింగర్ శ్రీరామ్ హోస్ట్ నాగార్జున ఆఫర్ చేసిన రూ. 25 లక్షలు తీసుకుని పోటీ నుండి తప్పుకున్నారట. సిరి, మానస్ లకు 5,4 స్థానాలు దక్కాయట. వీరిద్దరి ఎలిమినేషన్ అనంతరం టైటిల్ రేసులో సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ నిలిచారట.

ఈ దశలో నాగార్జున రూ. 25 లక్షలు ఆఫర్ చేశారట. ముగ్గురిలో ఒకరికి డబ్బులు తీసుకొని రేసు నుండి తప్పుకునే ఛాన్స్ ఉందని చెప్పగా… శ్రీరామ్ డబ్బులు తీసుకొని టైటిల్ పోరు నుండి విరమించుకున్నారట. శ్రీరామ్ నిష్క్రమణతో టైటిల్ రేసులో సన్నీ, షణ్ముఖ్ మిగిలారు. వీరిలో అత్యధిక ఓట్లు సంపాదించిన సన్నీ విన్నర్ గా టైటిల్ అందుకోగా… షణ్ముఖ్ రన్నర్ గా మిగిలాడని సమాచారం.
Also Read: ఈ పోరాటం ఏదో స్టీల్ ప్లాంట్ కోసం చేయండి… షణ్ముఖ్ ఫ్యాన్స్ పై నెటిజన్స్ ఫైర్!