Rao Bahadur Teaser Talk: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా మంది ఉన్నారు… ఇక ఇలాంటి క్రమంలోనే లో బడ్జెట్ లో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించే దర్శకులు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు…అందులో వెంకటేష్ మహా ఒకరు. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఒక ట్రెండ్ సృష్టించిన ఆయన ఆ తరువాత ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపాస్యా’ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇక ఇప్పుడు సత్య దేవ్ తో చేస్తున్న ‘ రావు బహదూర్ ‘ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత కొద్దిసేపటి క్రితమే ఈ సినిమా నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు… నిజానికి ఈ టీజర్ ను చూస్తుంటే సత్యదేవ్ తన నటనతో అదరగొట్టినట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం ఈ టీజర్ ను చూస్తుంటే ఇదొక గొప్ప సినిమాగా మారబోతోంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది…ఇందులో హీరో ఒక ఇంట్లో ఉంటూ తను రాజు లాగా ఊహించుకుంటూ ఉంటాడు…మరి అతను నిజంగానే రాజు అవుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
అయితే ఈ టీజర్ ను చూస్తుంటే ఇదొక మలయాళం మూవీ ఫ్లేవర్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది…ఒక చిన్న పాయింట్ తో సినిమా మొత్తాన్ని లాగుతున్నాడు…మరి ఈ సబ్జెక్ట్ మీద ఆయన ప్రేక్షకుడిని ఎంతసేపు కూర్చోబెడుతాడు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
ఇక ఇదిలా ఉంటే ఈ టీజర్ మీద ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి ట్వీట్ చేశాడు…తన పాత్రలను అద్భుతంగా చేస్తూ దానికి గొప్ప స్థాయిని కల్పించే సత్యదేవ్ కి అలాగే వెంకటేష్ మహా కి శుభాకాంక్షలు అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సత్య దేవ్ మంచి విజయాన్ని సాధిస్తే తనకంటూ ఒక మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నవాడు అవుతాడు…ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు బాగున్నప్పటికి ఆయనకి రావాల్సిన గుర్తింపైతే రావడం లేదు…మరి ఈ సినిమా ఎలాంటి గుర్తింపును సంపాదిస్తుంది అనేది తెలియాల్సి ఉంది….
Happy to see Satyadev evolving and portraying larger-than-life characters.
My best wishes to him and Maha for #RaoBahadur. Can’t wait to see what you guys are up to…@ActorSatyaDev @mahaisnotanoun pic.twitter.com/hNAdkIJIAk— rajamouli ss (@ssrajamouli) August 18, 2025