6 Runs Without Batting: క్రికెట్లో అప్పుడప్పుడు అద్భుతాలు చోటుచేసుకుంటాయి. ఒకప్పుడు ఇవి అంతగా వెలుగులోకి వచ్చేవి కావు. ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయింది కాబట్టి ప్రతిదీ కూడా అందుబాటులోకి వస్తోంది. పైగా చూసేవారికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది..
సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియో ప్రకారం… ఓ గ్రౌండ్లో కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు. బౌలర్ బంతి వేశాడు. స్ట్రైకర్ కొట్టేందుకు ప్రయత్నించగా బ్యాట్ తగలలేదు. దూసుకొచ్చిన బంతి ఫీల్డర్ నుంచి మిస్సైంది.. దీంతో స్ట్రైకర్, నాన్ స్ట్రైకర్ పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఒక పరుగును విజయవంతంగా తీశారు. మరో పరుగును అంతే వేగంతో తీశారు. మూడో పరుగు రనౌట్ చేసే అవకాశం వచ్చినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మూడో పరుగు కూడా విజయవంతంగా వచ్చింది. నాలుగో పరుగు తీసేందుకు ప్రయత్నించగా.. రనౌట్ చేసే అవకాశం వచ్చింది.. అయితే అది కూడా మిస్ అయింది. దీంతో నాలుగో పరుగు కూడా వచ్చింది. ఆ తర్వాత ఐదవ పరుగు విజయవంతంగా తీశారు. అదే ఊపులో ఆరోపరుగు తీసే క్రమంలో రన్ అవుట్ చేసే అవకాశం వచ్చింది. అది కూడా విఫలం కావడంతో ఆరోపరుగు విజయవంతంగా లభించింది.
Also Read: మీరు చెప్పిన మాట వినడమే గిల్ చేసిన నేరమా.. ఇలా వెన్నుపోటు పొడుస్తారా?
అయితే ఇది అంతర్జాతీయ క్రికెట్ కాదు. కొంతమంది స్నేహితులు కలిసి ఒక క్రికెట్ క్లబ్లో ఆడిన మ్యాచ్.. ఈ మ్యాచ్లో స్నేహితులు హోరాహోరీగా పోరాడారు. మ్యాచ్ మొత్తంలో ఒక బంతికి ఆరు పరుగులు తీసిన విధానం హైలెట్ గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. ” క్రికెట్ ఇలా కూడా ఆడతారా.. ఇలా కూడా పరుగులు చేస్తారా. చూస్తుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే చూస్తుంటే ఉత్సాహం కలుగుతోందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
FIRST TIME IN CRICKET HISTORY
– 6 Runs were scored in 1 ball, without touching the ball and 4 failed run-out attempts
– A Must Watch Video pic.twitter.com/0kG8A3PG88
— Richard Kettleborough (@RichKettle07) August 18, 2025