Dhurandhar 1000 crore club: బాక్స్ ఆఫీస్ వద్ద ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం రోజు రోజుకి ఎలాంటి బెంచ్ మార్క్స్ ని సెట్ చేస్తూ ముందుకు పోతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు విడుదలకు ముందు చాలా నెగిటివిటీ ఉండేది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా డల్ గా ఉన్నాయని , అంత బడ్జెట్ పెట్టి తీస్తే కనీసం పది కోట్ల రూపాయిల ప్రీ సేల్స్ కూడా రాలేదని, పైగా నిర్మాతకు ఆర్ధిక సమస్యలు ఉండడం వల్ల ఈ సినిమా ప్రెస్ మీట్స్ ని కూడా రద్దు చేసారని, విడుదలకు ముందే డిజాస్టర్ అయిపోయింది అంటూ ఎన్నో రకాల వార్తలు బాలీవుడ్ లో కొన్ని మీడియా చానెల్స్ ప్రచారం చేశాయి. కానీ చివరికి ఈ చిత్రం రెండవ రోజు నుండి వసూలు చేస్తూ వచ్చిన కలెక్షన్స్ ని చూసి, విమర్శించిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు.
మొదటి రోజు వచ్చిన వసూళ్లు కంటే , నిన్న వచ్చిన వసూళ్లు ఎక్కువ ఉన్నాయి. అంతే కాకుండా ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ సినిమాకు సాధ్యపడని అరుదైన రికార్డు ని నెలకొల్పింది. సింగల్ లాంగ్వేజ్ నుండి వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి చిత్రం గా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘దురంధర్’ కి ముందు 8 సినిమాలు వెయ్యి కోట్ల మార్కుని అందుకున్నాయి. బాహుబలి 2 , దంగల్,జవాన్, పఠాన్, #RRR , KGF చాప్టర్ 2 , పుష్ప 2 వంటి సినిమాలన్నీ అన్ని భాషలకు కలిపి వెయ్యి కోట్ల గ్రాస్ మార్కు ని అందుకున్నాయి. కాలం ‘దురంధర్ ‘ చిత్రం కేవలం హిందీ బాషా నుండే వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకుంది. అంతే కాదు నెట్ వసూళ్ల విషయం లో కూడా అతి త్వరలోనే ఈ సినిమా ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ వసూళ్లను దాటి నెంబర్ 1 స్థానం లో నిల్చుకోబోతుంది.
పుష్ప 2 చిత్రానికి హిందీ వెర్షన్ నుండి 750 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. దురంధర్ చిత్రానికి ఇప్పటి వరకు 668 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ తో 730 కోట్ల మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. మూడవ వారంలో ఈ చిత్రం అక్షరాలా 189 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది అట. క్రిస్మస్ రోజున, అనగా నిన్న ఈ చిత్రానికి 28 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఇక ఓవర్సీస్ లో మూడు వారాలకు కలిపి ఈ చిత్రానికి 217 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. డాలర్స్ లెక్కల్లో చూస్తే మొదటి వారం 7.8 మిలియన్ డాలర్లు రాగా, రెండవ వారం లో 9.2 మిలియన్ డాలర్లు, మూడవ వారం లో 7.15 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఓవరాల్ గా 24 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.