https://oktelugu.com/

ఓటీటీలోకి మరో లెజెండరీ క్రికెటర్ !

బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ పాన్ ఇండియా విడుదలకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవ్వాలి. కానీ, కరోనా మహమ్మారి రాకతో కపిల్ అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆ తరువాత ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ అవ్వబోతున్నట్లు.. గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజమేయ్యేలా కనిపిస్తున్నాయి. […]

Written By:
  • admin
  • , Updated On : August 30, 2020 9:32 am
    Follow us on


    బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ హీరోగా కబీర్ ఖాన్ దర్శకత్వంలో రానున్న లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ పాన్ ఇండియా విడుదలకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా మార్చిలో రిలీజ్ అవ్వాలి. కానీ, కరోనా మహమ్మారి రాకతో కపిల్ అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. ఆ తరువాత ఈ సినిమా ఓటిటీలో రిలీజ్ అవ్వబోతున్నట్లు.. గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ రూమర్స్ నిజమేయ్యేలా కనిపిస్తున్నాయి. ప్రముఖ ఓటిటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చింది అని.. ఈ సినిమా మేకర్స్ కూడా ఓటీటీకి తమ సినిమాని అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారని.. ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన రాబోతోందని తెలుస్తోంది.

    Also Read: ఆదిపురుష్.. ఫ్యాన్ మేడ్ వీడియో వైరల్

    ఆయితే నాలుగు నెలల క్రితమే మేకర్స్ కి అమెజాన్ నుండి ఈ బయోపిక్ కి భారీ ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు మేకర్స్ మాత్రం ఓటీటీలో తమ సినిమాని రిలీజ్ చేయాలనుకోలేదు. ఎందుకంటే తమ సినిమాలో మొత్తం 80 నాటి కాలం సంగతులను పరిస్థితులను అప్పటి నేపథ్యం తాలూకు విజువల్స్ ఎక్కువగా ఉంటాయని.. ప్రేక్షకులను 80 నాటి కాలంలోకి తీసుకువెళ్లాలన్నా.. సినిమాలోని ఫీల్ ను వాళ్లు ఇంకా బాగా ఓన్ చేసుకోవాలన్నా.. థియేటర్ అయితేనే బాగుంటుందని మేకర్స్ ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే కరోనా అనంతరమే తమ సినిమాని నేరుగా థియేటర్స్ లోనే విడుదల చేస్తామని స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల ప్రకారం థియేటర్లకు జనం రావాలంటే.. అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనబడటం లేదు.

    Also Read: సైరా నటుడితో సన్నీ లియోన్‌ ఐటమ్ సాంగ్‌

    అందుకే మొత్తానికి అమెజాన్ లో రిలీజ్ చేయడానికి ఈ బయోపిక్ మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అమెజాన్ లో రిలీజ్ చేయడమే ప్రొడ్యూసర్లకు బెటర్ అప్షన్. అదే థియేటర్లలో రిలీజ్ చేస్తే.. ఎదురు డబ్బులు కట్టి.. కలెక్షన్స్ లో తేడా జరగకుండా ఆ మొత్తం మేకర్స్ దగ్గరకు చేరాలంటే అది అంత తేలిక అయిన పనేమీ కాదు. అదే ఓటీటీలో రిలీజ్ చేస్తే.. డబ్బులు రూపాయి కూడా ఎదురు కట్టే పని ఉండదు. పైగా ఎలాంటి టెన్సన్స్ లేకుండా భారీ మొత్తంలో డబ్బులు ఒక్కసారిగా వచ్చి పడతాయి. అందుకే ఇప్పుడు భారీ సినిమాల నిర్మాతలు కూడా తమ సినిమాని ఓటిటీలో రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.