గత కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మౌనమునిగా అనేవారు. ఆయన తక్కువ మాట్లాడేవారు.. ఎక్కువ పనిచేసేవారు. స్వయంగా ఆర్థికవేత్త కావడంతో దేశ ఆర్థికవ్యవస్థ ఆయన కాలంలో బలంగా ఉండేది. జీడీపీ మెరుగ్గా ఉండేది.
Also Read: ‘లవ్ జిహాద్’.. మతం పేరిట యుద్ధం
కానీ ఇప్పుడు మాటల మాంత్రికుడు మోడీ హయాంలో ఆర్థికవ్యవస్థ కుదేలైంది. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారన్న అపవాదును మూటగట్టుకున్నారు. మోడీజీ ఆ తప్పునుంచి మెల్లిగా బయటపడుతున్న వేళ కరోనా దాడితో పూర్తిగా చేతులులెత్తేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఊదరగొట్టడం అభాసుపాలైంది. అది ఎవరికి లబ్ధి చేకూర్చలేదని తెలిసి విమర్శల పాలయ్యారు.
అయితే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా.. జనాలు ఉద్యోగ, ఉపాధి కోల్పోయినా.. ప్రజలను ఆకట్టుకోవడం.. బోల్తా కొట్టించడంలో మోడీని మించిన ఘనుడు లేడంటారు. దేశంలో ప్రతీసారి ట్రెండింగ్లో ఉండడం మోడీకే సాధ్యమంటారు.
ఇటీవల ధోని , రైనా రిటైర్ మెంట్ తో అందరి చూపు వారిపై మళ్లిన వేళ.. ధోనికి మోడీ లేఖ రాయడం.. దానికి ధోని కృతజ్ఞతలు తెలుపడంతో మొత్తం ఫోకస్ తనవైపు తిప్పుకున్నారు. ఇక దేశ ఆర్థిక, సామాజిక సమస్యల కంటే జాతీయవాదం, హిందుత్వం, పాక్, చైనాలతో యుద్ధోన్మాదంతో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి మోడీ తనవైపు తిప్పుకుంటారు.
Also Read: ఐపీఎల్‌పై కరోనా కాటు.. షెడ్యూల్‌లో భారీ మార్పులు!
ఇప్పుడు తాజాగా యూపీలోని ఝాన్సీ వ్యవసాయ వర్సిటీలో తెలుగు విద్యార్థితో మాట్లాడుతూ ‘గారు’ అంటూ సంభోదించి తనకు తెలుగు తెలుసు అని.. అక్కడి మర్యాదలు తెలుసు అని.. వ్యవసాయంలో తెలుగు రాష్ట్రాలు దేశంలోనే ముందంజలో ఉన్నాయని ప్రధాని పొగిడేశారు. ఇలా ఒక్క విద్యార్థితో ప్రేమగా.. చలోక్తిగా మాట్లాడి అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు. జనాలను ఆకట్టుకోవడంలో మోడీని మించిన వారు లేరని మరోసారి నిరూపించుకున్నారు.
–నరేశ్