Ranveer Singh Kantara Controversy: ఒకప్పుడు బాలీవుడ్ హీరోలకు సౌత్ సినిమా అంటే చిన్న చూపు ఉండేది…ఇప్పటికి మన సౌత్ నుంచి గొప్ప సినిమాలు వస్తున్నప్పటికీ మన వాళ్ళు సాధించే సక్సెస్ లను ఒప్పుకోలేక, వాళ్ళు సక్సెస్ లను సాధించలేక అయోమయం లో ఉన్నారు. ఇక ఇప్పటికి మన వాళ్ళను చిన్న చూపు చూడాలని చూస్తే ఊరుకునేది లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు…ఇక అందులో భాగంగానే కన్నడ సినిమా ఇండస్ట్రీ లో వచ్చిన కాంతార సినిమా ఎంతటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే…
ఇక అలాంటి సినిమాను బాలీవుడ్ హీరో అయిన రణ్వీర్ సింగ్ కాంతార సినిమా మీద కామెంట్స్ చేయడం ఇప్పుడు ప్రతి ఒక్కరికి కోపాన్ని తెప్పిస్తోంది…అసలు విషయంలో వెళ్తే గోవా లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ లో కాంతార లో హీరోలోకి దెయ్యం అవహించినప్పుడు హీరో ఇలా అరుస్తాడు అంటూ ఓ అంటూ అరుస్తూ దానిని కామెడీ చేయాలని చూశాడు.
కానీ ఇప్పుడు సౌత్ ఇండియా ప్రేక్షకులందరు అతని మీద కామెంట్స్ చేస్తున్నారు…కారణం ఏంటంటే కాంతార హీరో ను అవహించేది దెయ్యం కాదు పెంజర్లి అనే దేవుడు…అది కూడా తెలియకుండా నువ్వు కాంతార మూవీ ని ఎలా కామెడీ చేస్తావ్…కర్ణాటక లోని చాలా మంది పవిత్రం గా కొలుచుకునే పెంజర్లి దేవుడిని నువ్వే అలా కామెడీ చేయడం కరెక్ట్ కాదు అంటూ కన్నడిగుల కోపానికి గురవుతున్నాడు…
ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను రిషబ్ శెట్టి కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది…మొత్తానికైతే ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోల్లో యశ్ తర్వాత రిషబ్ శెట్టి అంత గొప్ప క్రేజ్ ను అందుకున్నాడు…ఇక ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్టులను చేయడానికి ఆయన ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నాడు… దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇతర భాషల సినిమాలను కూడా చేస్తుండటం విశేషం…
