Homeఎంటర్టైన్మెంట్Ranveer Singh Fan Gift Reaction: ఫ్యాన్ ఇచ్చిన బహుమతికి రణవీర్ సింగ్ రియాక్షన్ చూడండి.....

Ranveer Singh Fan Gift Reaction: ఫ్యాన్ ఇచ్చిన బహుమతికి రణవీర్ సింగ్ రియాక్షన్ చూడండి.. ఈ కాలంలో కూడా ఇలాంటి హీరోలు ఉంటారా..

Ranveer Singh Fan Gift Reaction: సినీ తారలు నేడు కోట్ల రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్స్ ని అందుకుంటూ, లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తున్నారంటే అందుకు కారణం అభిమానులు. అభిమానులంటే సాక్షాత్తు దేవుళ్లతో సమానం. అలాంటి అభిమానులను కొంతమంది హీరోలు అవమానిస్తూ ఉంటారు. కేవలం ఒక్క సెల్ఫీ అడిగితే చెంప చెళ్లుమని వాయించే సందర్భాలను కూడా మనం గతంలో చాలానే చూశాము. కొంతమంది అయితే కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు, అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తారు. కొంతమంది అయితే బౌన్సర్లతో కొట్టిస్తారు. ఇలాంటి దారుణమైన హీరోలు ఉన్న ఈ రోజుల్లో, అభిమానులను దేవుళ్లుగా భావించే హీరోలు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి హీరోల్లో ‘ధురంధర్’ ఫేమ్ రణవీర్ సింగ్ కూడా ఉన్నాడు. రీసెంట్ గా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో ని చూసి నెటిజెన్స్ రణవీర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: పవన్ కళ్యాణ్ తో ‘ధురంధర్ 2’ డైరెక్టర్ ఆదిత్య డర్ భేటీ.. త్వరలోనే బ్లాస్టింగ్ అప్డేట్ లోడింగ్..

ఒక ఈవెంట్ కి హాజరైన రణవీర్ సింగ్ , తిరిగి వెళ్తున్న సమయం లో ఒక వీరాభిమాని బౌన్సర్లను దాటుకొని రణవీర్ వద్దకు చేరుకుంటాడు. ఇలా దూసుకొచ్చే అభిమానులను మన సౌత్ హీరోలు ట్రీట్ చేసే విధానం ఎలా ఉంటుందో చాలా సందర్భాల్లో చూశాము . చాలా వైల్డ్ రియాక్షన్ ఉంటుంది. కానీ రణవీర్ సింగ్ మాత్రం అలా దూసుకొచ్చిన అభిమాని తో ప్రేమగా మాట్లాడుతూ సెల్ఫీ ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటాడు. అంతలోపు ఆ అభిమాని తన చేతిలో రణవీర్ సింగ్, దీపికా పదుకొనే మరియు వీళ్లిద్దరి కూతురు కలిసి ఉన్న ఫోటో తో తయారు చేయించిన ఫ్రేమ్ ని చూపిస్తాడు. అది చూసిన రణవీర్ సింగ్ ఎంతో సంతోషిస్తాడు. ఆ అభిమానిని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతాడు. అభిమాని పట్ల రణవీర్ చూపించిన ఈ ప్రేమకు నెటిజెన్స్ మొత్తం ఫిదా అయిపోయారు. సినిమాల్లోనే కాదు , నిజ జీవితం లో కూడా రణవీర్ సింగ్ హీరోనే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్.

రణవీర్ సింగ్ తన జీవితం లో ఇలాంటి బహుమతులను ఎన్నో చూసి ఉంటాడు. తన ఇంట్లో ఇంతకంటే అందమైన ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉండే ఉంటాయి, అయినప్పటికీ అభిమాని ప్రేమతో ఇచ్చిన ఆ ఫోటో ఫ్రేమ్ కి అంత సంతోషాన్ని వ్యక్తం చేశాడంటే , తన అభిమానులకు ఆయన ఇస్తున్న గౌరవం, చూపిస్తున్న ప్రేమ ఎలాంటిదో అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి హీరోలే మన ఇండియన్ సినీ పరిశ్రమకు కావాలి , అందరూ ఈయన లాగా ఉండాలి అంటూ విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి వాయు’గండం’!

AP Rain Alert: ఏపీకి నైరుతి రుతుపవనాలు ముఖం చాటేసాయి. ఆలస్యంగా వచ్చి మందగించాయి కూడా. దీంతో వర్షం పడకపోగా లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొంత...
Jogi Ramesh daughter In Law

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...
Oktelugu Epaper