Deepika Padukone: బ్రేకింగ్… గర్భం దాల్చిన దీపికా పదుకొనె, కల్కి పూర్తి కాకుండానే!

దీపికా పదుకొనె హీరో రన్బీర్ కపూర్ ని ప్రేమించారు. అతనితో బ్రేకప్ కారణంగా దీపికా మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఇప్పటికి కూడా దీపికా పదుకొనె డిప్రెషన్ తో బాధపడుతున్నారనే పుకార్లు ఉన్నాయి.

Written By: S Reddy, Updated On : February 29, 2024 10:56 am
Follow us on

Deepika Padukone: ఎట్టకేలకు దీపికా పదుకొనె-రణ్వీర్ సింగ్ గుడ్ న్యూస్ చెప్పారు. తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం వెల్లడించారు. దీపికా పదుకొనె బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్నారు. దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్. దీపికా పదుకొనె 2018లో నటుడు రణ్వీర్ సింగ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళై ఐదేళ్లు దాటిపోయింది. అయినా ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. ఈ క్రమంలో దీపికా దంపతులు ఒకింత విమర్శలు ఎదుర్కొన్నారు. వారు పేరుకే భార్య భర్తలు… ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదంటూ కథనాలు వెలువడ్డాయి.

ఒక దశలో విడిపోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. తాజా ప్రకటనతో ఈ పుకార్లకు చెక్ పెట్టారు. దీపికా పదుకొనె తన ఇంస్టాగ్రామ్ వేదికగా తల్లి కాబోతున్న విషయం వెల్లడించింది. 2024 సెప్టెంబర్ నెలలో ఆమె ప్రసవించనుంది. దీపికా పదుకొనె తల్లయ్యారన్న న్యూస్ ఆమె అభిమానుల్లో ఆనందం నింపించింది. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా దీపికా పదుకొనె హీరో రన్బీర్ కపూర్ ని ప్రేమించారు. అతనితో బ్రేకప్ కారణంగా దీపికా మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఇప్పటికి కూడా దీపికా పదుకొనె డిప్రెషన్ తో బాధపడుతున్నారనే పుకార్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చారన్న న్యూస్ సానుకూలతకు దారి తీసింది. మరోవైపు దీపికా పదుకొనె కల్కి 2829 AD లో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.

దీంతో దీపికా పదుకొనె ప్రెగ్నెన్సీ ప్రకటన చర్చకు దారి తీసింది. కల్కి మూవీలో దీపికా పదుకొనె మెయిన్ హీరోయిన్. లేడీ వారియర్ గా ఆమె కనిపిస్తారని సమాచారం. మరి దీపికా పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందా? లేక గర్భంతోనే ఆమె షూటింగ్ లో పాల్గొనాల్సి ఉందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రభాస్ కెరీర్లో మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. మే 9న విడుదల కానుంది.