Rangasthalam Part 2: టాలీవుడ్ లో కొన్ని సినిమాలను మనం ఎప్పటికి మరచిపోలేము..బాక్స్ ఆఫీస్ పరంగా కానీ..కంటెంట్ పరంగా కానీ..ఆయా సినిమాలు దక్కించుకున్న స్థానం చెక్కు చెదరనిది..తెలుగు సినిమా ని మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రాలవి..అలాంటి సినిమాలలో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా నటించిన రంగస్థలం చిత్రం..ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ని ఎవరు మాత్రం మర్చిపోగలరు..!

బాక్స్ ఆఫీస్ పరంగా రామ్ చరణ్ కి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ సినిమాగా నిలవడమే కాకుండా..నటుడిగా ఆయనకీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టి ఎన్నో అవార్డులను ఆయనకీ తెచ్చిపెట్టాయి..నేషనల్ అవార్డు కూడా వస్తుంది అనుకున్నారు కానీ, తృతిలో తప్పింది..ఇక ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచినప్పటికీ..#RRR సినిమాతో రామ్ చరణ్ పాన్ వరల్డ్ స్టార్ ఇమేజి ని దక్కించుకున్నాడు.
అలాగే పుష్ప సినిమాతో కూడా సుకుమార్ పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు దక్కించుకున్నాడు..ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో త్వరలో ఒక సినిమా రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీ గా గడుపుతున్న సుకుమార్..ఇప్పుడు రంగస్థలం పార్ట్ 2 కి కూడా స్టోరీ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది..ఇటీవలే రామ్ చరణ్ ని కలిసి స్టోరీ లైన్ కూడా వినిపించాడట సుకుమార్..రామ్ చరణ్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచినా సినిమాకి సీక్వెల్ అంటే ఇక దాని క్రేజ్ ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అయితే పుష్ప సినిమాని హిందీ లో అందరూ చూసారు..అక్కడ పెద్ద హిట్ అయ్యింది.

కానీ రంగస్థలం సినిమాని హిందీ లో ఎవ్వరు చూడలేదు..అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే అక్కడ క్రేజ్ వస్తుందా లేదా అనే సందేహం అభిమానుల్లో ఉంది..రామ్ చరణ్ అంటే పాన్ ఇండియా స్టార్..ఆయన సినిమాలు కచ్చితంగా హిందీ లో దబ్ అవ్వాల్సిందే..కాబట్టి రంగస్థలం పార్ట్ 2 విడుదల కంటే ముందే..బాలీవుడ్ లో రంగస్థలం సినిమాని దబ్ చేసి విడుదల చేద్దామనే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ సుకుమార్..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.