Bigg Boss 6 Telugu Inaya Sultana- Srihan: ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్కు ఎంత ఆసక్తికరంగా సాగిందో మన అందరికి తెలిసిందే..బిగ్ బాస్ ఇచ్చిన ‘చేపల చెరువు’ టాస్కు లాక్ బస్టర్ హిట్ అయ్యింది..అంతే కాకుండా ఈ వారం బిగ్ బాస్ కి కూడా అద్భుతమైన TRP రేటింగ్స్ ని రప్పించేలా చేసింది ఈ టాస్క్..దీనితో బిగ్ బాస్ టీం కూడా ఇక నుండి ఎంటర్టైన్మెంట్ టాస్కులు ఇవ్వకుండా, కేవలం ఫిజికల్ టాస్కులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఫిక్స్ అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక ఈ వారం కెప్టెన్ గా శ్రీహాన్ బాధ్యతలు చేపట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించగానే తన మార్కును చూపించే ప్రయత్నం చేసాడు శ్రీహాన్..ముందుగా రేషన్ మేనేజర్ గా ఎవరిని నియమించాలి హౌస్ మేట్స్ తో చర్చించి రేవంత్ ని రేషన్ మేనేజర్ ని చేసాడు..అంతే కాకుండా హౌస్ లో ఫుడ్ వెస్టీజి మీద కూడా శ్రీహాన్ కాస్త గట్టిగానే ఇంటి సభ్యులను మందలించాడు.
‘ఈరోజు రోహిత్ కి రైస్ సరిపోలేదు..కానీ ఇంట్లో ఉన్న కొంత మంది ఇంటి సభ్యులు రైస్ ని చాలా మిగిలించి పడేసారు..ముందుగానే చెప్పి ఉంటె రోహిత్ కి రైస్ దక్కేది’ అని శ్రీహాన్ ఇంటి సభ్యుల దగ్గరకి వచ్చి చెప్తాడు..అప్పుడు వెంటనే ఇనాయ మధ్యలో కలుగచేసుకొని ‘నాకు కర్రీ సరిపోకనే రైస్ వదిలేసాను..అంతే కానీ కావాలని చెయ్యలేదు’ అంటూ ముందుకు వస్తుంది..అప్పుడు శ్రీహాన్ మాట్లాడుతూ ‘గుమ్మడి కాయ దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకునట్టు..నేను అసలు నీ పేరు తీశానా..!, నీ పేరు పిలిచినప్పుడు మాత్రమే మాట్లాడు..మధ్యలోకి రాకు’ అని వార్నింగ్ ఇస్తాడు.

అప్పుడు ఇనాయ మాట్లాడుతూ ‘రైస్ మిగిలిపోయింది నాకే..నేను కాకపోతే ఇంకా ఎవరు రియాక్ట్ అవ్వాలి’ అంటుంది..అప్పుడు శ్రీహాన్ మాట్లాడుతూ ‘నీకే కాదు..శ్రీ సత్య కి కూడా రైస్ మిగిలిపోయింది’ అని అంటాడు..’నేను కూడా నీకు చెప్పట్లేదు..ఇంటి సబ్యులకు క్లారిటీ ఇచ్చుకుంటున్నాను’ అని చెప్తుంది..అప్పుడు శ్రీహన్ ఫైర్ అవుతూ ‘నేను మాట్లాడుతున్నప్పుడు కాదు..నేను లేని సమయం లో చెప్పుకో’ అంటాడు..అలా ఇనాయ సుల్తానా కావాలని గెలుక్కొని శ్రీహాన్ దగ్గర చివాట్లు తింటుంది.