Rangasthalam
Rangasthalam : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం (Rangasthalam) సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ ఒక్కసారిగా పాన్ ఇండియాలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తన కెరీర్ లోనే రెండో ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేసుకున్నాడు. ఇక నటనలో పరిణీతి ని చూపిస్తూ చెవిటి వాడి పాత్రలో అద్భుతంగా నటించడమే కాకుండా చిట్టిబాబు అనే పాత్రకి ప్రాణం కూడా పోసాడనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయన నటన చూసిన తర్వాత ఆ పాత్రకి ఆయన తప్ప మరెవరు న్యాయం చేయలేరని విమర్శకులు సైతం ప్రశంసలను కురిపించారు. మరి ఏది ఏమైనా కూడా ఇలాంటి నటుడు ఇప్పుడు రాబోయే సినిమాలతో మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాల్సిన అవసరమైతే వచ్చింది. ఇక గేమ్ చేంజర్ (Game Changer) సినిమాతో భారీగా డీలా పడిన ఆయన బుచ్చి బాబుతో చేస్తున్న సినిమాతో మరోసారి భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే రంగస్థలం సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో మహేష్ బాబు కూడా నటించాల్సిందట. కానీ అనుకోకుండా స్క్రిప్ట్ స్టేజ్ లోనే ఆ సీన్స్ ని సుకుమార్ తొలగించారట. నిజానికి మహేష్ బాబు ఈ సినిమాలో కనిపిస్తే సినిమాకి మరింత మైలేజ్ అయితే వచ్చేది. కానీ ఆయన క్యారెక్టర్ సినిమా ఫ్లోకి అడ్డుగా ఉందనే ఉద్దేశంతో స్క్రిప్ట్ దశలోనే సుకుమార్ ఆ సీన్స్ ను డిలీట్ చేసేశారట. దానివల్ల మహేష్ బాబు రంగస్థలంలో నటించే అవకాశమైతే కోల్పోయాడు.
Also Read : రంగస్థలం సినిమాకి అన్యాయం చేసిన సుకుమార్…దాని వల్ల రామ్ చరణ్ కి భారీ ఎఫెక్ట్ పడిందా..?
నిజానికి సుకుమార్ కి మహేష్ బాబుకి మధ్య మంచి సన్నిహిత సంబంధలైతే ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి వీళ్ళ కాంబో లో మరో సినిమా తెరకెక్కె అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు.
కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో మరోసారి ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారట.
ఇక ఇప్పటికే స్క్రిప్ట్ పనులను కూడా మొదలుపెట్టిన సుకుమార్ వీలైనంత తొందరగా స్క్రిప్ట్ ను ముగించి సినిమా చేసే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక బుచ్చిబాబు సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ తొందర్లోనే ఆ సినిమా షూటింగ్ ను కూడా ముగించుకొని ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాడు…
Also Read : సుకుమార్ రంగస్థలం లో ఆది కంటే ముందు ఆ హీరోని తీసుకోవాలనుకున్నాడా..?