https://oktelugu.com/

Rangbali collections : ‘రంగబలి’ మొదటి రోజు వసూళ్లు..ప్రొమోషన్స్ అయినా ఖర్చులు కూడా రాబట్టలేకపోయిందిగా!

ఇక ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందని టాక్. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసమే మూడు కోట్ల రూపాయిలను ఖర్చు చేసారు, ఇక ఫుల్ రన్ లో కనీసం ఆ మూడు కోట్ల రూపాయిలను అయినా రాబడుతుందో లేదో చూడాలి.

Written By: , Updated On : July 7, 2023 / 10:02 PM IST
Follow us on

Rangbali collections : నాగ శౌర్య హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రంగబలి’ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యావరేజి టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడుకున్న సినిమాకి యావరేజి టాక్ వచ్చినా చాలు, బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తాయి. అలాంటిది ‘రంగబలి’ చిత్రానికి యావరేజి టాక్ వచ్చినప్పటికీ కూడా కనీస స్థాయి వసూళ్లు కూడా రాలేదంటే, నాగ శౌర్య మార్కెట్ ఏ రేంజ్ లో డౌన్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

కమెడియన్ సత్య ఇంటర్వ్యూస్ స్పూఫ్ కారణం గా ఈ చిత్రానికి మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీలు 30 శాతం తో ప్రారంభం అయ్యాయి. కానీ మ్యాట్నీ షోస్ నుండి మాత్రం దారుణంగా డౌన్ అయ్యాయి. మార్నింగ్ షోస్ లో కనీసం 50 శాతం కూడా హోల్డ్ చేసుకోలేకపోయింది. అలా షో షో కి తగ్గిపోతూ వచ్చాయి వసూళ్లు, ఇది నిజంగా మేకర్స్ కి పెద్ద షాక్ లాంటిది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 5 కోట్ల 50 లక్షల రూపాయిల వరకు జరిగింది. కమర్షియల్ సినిమా మరియు మినిమం గ్యారంటీ సినిమా అని టీజర్ , ట్రైలర్ మరియు ప్రొమోషన్స్ చూసినప్పుడు ఆడియన్స్ తో పాటుగా ట్రేడ్ కి కూడా అనిపించింది కాబట్టి ఈ చిత్రం కి ఇంత మంచి బిజినెస్ జరిగింది. 5 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ మంచి బిజినెస్ అని అంటున్నారేంటి అని అనుకోవచ్చు, కానీ నాగ శౌర్య కి ఈమధ్య వచ్చిన వరుస ఫ్లాప్ సినిమాలకు ఈ మాత్రం బిజినెస్ జరిగిందంటే గ్రేట్ అనే చెప్పొచ్చు.

ఇక ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు కేవలం కోటి రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చిందని టాక్. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసమే మూడు కోట్ల రూపాయిలను ఖర్చు చేసారు, ఇక ఫుల్ రన్ లో కనీసం ఆ మూడు కోట్ల రూపాయిలను అయినా రాబడుతుందో లేదో చూడాలి.