Rashmika Mandana : పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు సెన్సేషన్ సృష్టిస్తున్న హీరోయిన్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే మనకి గుర్తుకి వచ్చే మొట్టమొదటి పేరు రష్మిక(Rashmika Mandana). శాండిల్ వుడ్ లాంటి చిన్న సినీ పరిశ్రమ నుండి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక, అతి తక్కువ సమయంలోనే సూపర్ హిట్స్ ని అందుకొని ఇక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె రేంజ్ సౌత్ మొత్తానికి ఎగబాకి, వరుస హిట్స్ అందుకొని పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా అవతరించింది. పుష్ప(Pushpa Movie) తర్వాత ఆమె చేసిన బాలీవుడ్ చిత్రం ‘యానిమల్ ‘(Animal Movie) ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మన అందరికీ తెలిసిందే. కేవలం థియేటర్స్ లోనే కాకుండా ఓటీటీ లో కూడా సునామీ ని సృష్టించింది ఈ చిత్రం. ఆ తర్వాత విడుదలైన ‘పుష్ప 2’ బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అవ్వడం రష్మిక ని సూపర్ స్టార్ ని చేసింది.
ఇక నేడు ఆమె హీరోయిన్ గా నటించిన మరో ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రం ‘చావా'(Chhaava Movie) భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాకి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో ప్రతీ సెంటర్ లోనూ బంపర్ ఓపెనింగ్ దక్కింది. కేవలం హిందీ భాషలో మాత్రమే విడుదల అయిన ఈ సినిమాకి మొదటి రోజు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇది ఇలా ఉండగా విడుదలకు ముందు హీరోయిన్ రష్మిక ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో, ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘నేను కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే చేయాలని లైన్ గీసుకోలేదు. నాకు కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం’ అంటూ చెప్పుకొచ్చింది.
‘అది నెగటివ్ రోల్ అయినా, నలుగురు పిల్లలకు తల్లి పాత్ర అయినా, బామ్మ పాత్ర అయినా చేయడానికి నేను సిద్ధం. నేను నటిస్తున్న సినిమాలు ఇప్పుడు వరుసగా సూపర్ హిట్స్ అవుతున్నాయి అంటే, దానికి నేను ఎలాంటి ప్రణాళికలు చేసుకోలేదు. అదృష్టం మన చేతిలో ఉండదు అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను. అదే విధంగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టడానికి కారణం, నన్ను ఎదో శక్తి నడిపిస్తుంది అని అర్థం అవుతుంది. చావా చిత్రం లో నేను యేసుబాయి పాత్రలో నటించాను. ఇలాంటి రోల్ లో నటించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఇంత తక్కువ సమయంలో ఇలాంటి నటనకు స్కోప్ ఉన్న పాత్రలు వరుసగా లభించడం నా అదృష్టం గా భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆమె సల్మాన్ ఖాన్ తో కలిసి ‘సికందర్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అదే విధంగా తెలుగులో ఈమె ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుంది.