Sukumar: పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ సుకుమార్… ఇంతకుముందు ఆయన చేసిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించినప్పటికీ, పాన్ ఇండియా రేంజ్ లో మాత్రం సుకుమార్ కు మంచి పేరును తీసుకొచ్చిన సినిమా పుష్ప. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో పుష్ప 2 సినిమాని కూడా చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే ఆసక్తికరమైన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక తను మాత్రం నెక్స్ట్ సినిమాని కూడా తెలుగు హీరోతో చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే రీసెంట్ గా అనిమల్ తో సూపర్ సక్సెస్ అందుకున్న రన్బీర్ కపూర్ ఈ సినిమాతో ఏకంగా 900 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
అయితే ఇంత భారీ సక్సెస్ వచ్చిన తర్వాత తను చేయబోయే నెక్స్ట్ సినిమాను కూడా మరొక భారీ సక్సెస్ గా మలచాలనే ఉద్దేశ్యం తోనే తను ఒక సుకుమార్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసమే సుకుమార్ ని ఒక్క ఛాన్స్ ఇవ్వు సుకుమార్ అంటూ బ్రతిమిలాడుతున్నట్టుగా తెలుస్తుంది.
తనకు తెలిసిన వాళ్లందరితో సుకుమార్ కి చెప్పించి కూడా చూస్తున్నాడు. మరి రన్బీర్ కపూర్ ఎలాగైనా సుకుమార్ తో ఒక సినిమా చేయాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది. మరి ఇలాంటి క్రమంలో సుకుమార్ రన్బీర్ తో సినిమా చేస్తాడా లేదా అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే సుకుమార్ ఖాతాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఉన్నారు. మరి వీళ్ళని కాదని బాలీవుడ్ హీరో తో సినిమా చేస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…