https://oktelugu.com/

Geetha Arts: గీతా ఆర్ట్స్ లో గీతా అనే పేరు ఎందుకు పెట్టారో తెలుసా?

మొత్తం మీద అల్లు అరవింద్ గొప్ప నిర్మాతగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఈ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 13, 2024 / 04:45 PM IST

    Geetha Arts

    Follow us on

    Geetha Arts: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో నిర్మాణ సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాయి. ఈ విధంగా ఇండస్ట్రీలో నిర్మాణ సంస్థగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి వాటిలో గీతా ఆర్ట్స్ బ్యానర్ కూడా ఒకటి. ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య ఈ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇక ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలు అన్నీ కూడా ఆయన కుమారుడు అల్లు అరవింద్ చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

    మొత్తం మీద అల్లు అరవింద్ గొప్ప నిర్మాతగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఈ బ్యానర్ నుంచి ఎన్నో విజయవంతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇకపోతే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో గీత అంటే ఎవరు అనే సందేహాలు చాలా మందిలో మెదుగుతున్నాయట. దీనికి సమాధానంగా చాలా మంది అల్లు అరవింద్ గర్ల్ ఫ్రెండ్ అంటూ కొందరు ఊహించుకుంటున్నారు. అయితే ఈ విషయం గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ గీతా ఆర్ట్స్ అని పెట్టడం వెనుక ఉన్న రహస్యం చెప్పారు.

    నిర్మాణ సంస్థను ప్రారంభించాలి అనుకున్న సమయంలో అల్లు అరవింద్ నాన్న గీత అనే పేరును సెలెక్ట్ చేశారట. ఈ పేరు పెట్టడానికి కారణం కూడా లేకపోలేదని తెలిపారు అల్లు అరవింద్. ఈ పేరుకు అర్థం భగవద్గీత నుంచి తీసుకున్నారట. భగవత్ గీత.. అయితే దీని అర్థం ప్రయత్నం మాత్రమే మనది.. ఫలితం మన చేతుల్లో లేదు అని ఒక గొప్ప సందేశం ఉంటుంది. అది అక్షరాల సినిమా ఇండస్ట్రీకి సూట్ అవుతుందని భావించి అల్లు అరవింద్ గారి నాన్న ఈ పేరును సెలెక్ట్ చేశారని తెలిపారు.

    అయితే ఒక నిర్మాణ సంస్థలో సినిమా చేయటం వరకు మాత్రమే మన పని.. ఒక మంచి సినిమాను ఇవ్వాలనే ప్రయత్నం నిర్మాణ సంస్థ చేస్తుందని.. సినిమా ఫలితం ప్రేక్షకులు ఇస్తారని తెలిపారు. చాలా మంది తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటారు. ఈ మాట వాస్తవమేనని.. ఆమె పేరు కూడా గీత అని.. అందుకే ఈ పేరు పెట్టానని అంటారు. కానీ అందులో నిజం లేదని తెలిపారు అల్లు అరవింద్.