Ranbir Kapoor And Alia Bhatt Wedding: సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో, హీరోయిన్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఈ సాంప్రదాయం బాలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లో దీపికా పదుకొనే-రణవీర్ సింగ్ నుంచి మొదలుపెడితే.. తాజాగా ఈ లిస్టులో ఆలియా భట్, రన్ బీర్ కపూర్ వచ్చి చేరారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రేమ పక్షుల వివాహం గురించి హాట్ హాట్ గా చర్చ సాగుతూనే ఉంది. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. పార్టీలు ఫంక్షన్లు అంటూ ఎక్కడ చూసినా వీరే కనిపించేవారు.

దీంతో వీరిద్దరి అభిమానులు వీరి వివాహం ఎప్పుడెప్పుడా అని వేయికళ్ళతో ఎదురు చూశారు. అందరి ఊహాగానాలకు తెర తీస్తూ.. గురువారం వీరిద్దరూ అతి కొద్దిమంది సన్నిహితుల నడుమ పెళ్లి చేసుకున్నారు. బాంద్రాలోని వాస్తు అపార్ట్ మెంట్ లో వీరిద్దరూ ఒకటయ్యారు. ఇక తమ పెళ్లి ఫొటోలను ఆలియా అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియా ఖాతాలో ఆమె షేర్ చేసిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి బట్టల్లో ఆలియా, రన్ బీర్ వైభవంగా మెరిసిపోయారు.
Also Read: KCR Ambedkar: కేసీఆర్.. అంబేద్కర్.. ఎందుకంత దూరం?
ఇక కొత్త జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి సందర్భంగా రన్ బీర్ కపూర్ తన భార్య ఆలియాకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడని సమాచారం. ఆలియాకి మొదటి నుంచి 8 లక్కీ నెంబర్ అని తెలిసిందే. ఇది కలిసి వచ్చే విధంగా 8 ఖరీదైన వజ్రాలు పొదిగిన వెడ్డింగ్ బ్యాండ్ ను గిఫ్ట్ గా ఇచ్చాడట. అది చూసిన ఆలియా ఎంతో మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

ఇక ఆలియా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ విషయాన్ని కూడా పంచుకుంది. తాము ఐదేళ్లుగా ఏ బాల్కనీలో అయితే ప్రేమించుకున్నామో అక్కడే తమ పెళ్లి జరిగిందని తెలిపింది. ఈ నెల 17న ముంబైలోని ఓ స్టార్ హోటల్లో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ పార్టీకి అన్ని ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు హాజరవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తున్నారట. ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also Read:Karnataka Minister Eshwarappa : కర్ణాటక అవినీతి కంపు బీజేపీని దహించేస్తోందా?