https://oktelugu.com/

Trivikram Wife: శిల్పకళావేదికపై త్రివిక్రమ్ భార్య నృత్యప్రదర్శన.. ముఖ్య అతిథిగా పవర్​స్టార్​

Trivikram Wife: త్రివిక్రమ్​ సినిమాలు ఎంత క్లాస్​గా ఉంటాయో.. ఆయన రాసే మాటలు మాస్​గా తూటాల్లా దూసుకెళ్లిపోతుంటాయి. రచయితగా టాలీవుడ్​లో అడుగుపెట్టి.. ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన దర్శకుల్లో ఒకరిగా చలామని అవుతున్నారు. కాగా, త్రివిక్రమ్ భార్య సౌజన్య గురించి అందరికీ తెలిసిందే. ఆమె మంచి క్లాసికల్ డాన్సర్​. ప్రస్తుతం మీనాక్షి కళ్యాణం అనే శాశ్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సౌజన్య శ్రీనివాస్​. ఈ ప్రదర్శన డిసెంబరు 2న జరగాల్సి ఉండగా.. ఆమె బాబాయ్​ రచయిత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 16, 2021 / 10:14 AM IST
    Follow us on

    Trivikram Wife: త్రివిక్రమ్​ సినిమాలు ఎంత క్లాస్​గా ఉంటాయో.. ఆయన రాసే మాటలు మాస్​గా తూటాల్లా దూసుకెళ్లిపోతుంటాయి. రచయితగా టాలీవుడ్​లో అడుగుపెట్టి.. ఇప్పుడు అత్యంత ప్రభావవంతమైన దర్శకుల్లో ఒకరిగా చలామని అవుతున్నారు. కాగా, త్రివిక్రమ్ భార్య సౌజన్య గురించి అందరికీ తెలిసిందే. ఆమె మంచి క్లాసికల్ డాన్సర్​. ప్రస్తుతం మీనాక్షి కళ్యాణం అనే శాశ్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సౌజన్య శ్రీనివాస్​. ఈ ప్రదర్శన డిసెంబరు 2న జరగాల్సి ఉండగా.. ఆమె బాబాయ్​ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకస్మాత్తుగా మరణించడంతో ఈ నాట్య ప్రదర్శన వాయిదా పడింది.

    Trivikram Wife

    Also Read: చిరుకి ఏమైంది ? వారికెలా ఛాన్స్ ఇస్తున్నాడు ?

    తాజాగా, ఈ ప్రదర్శనను రేపు సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదిగా జరగనుంది. పసుమర్తి రామలింగ శాస్త్రి ఈ కార్యక్రమానికి దర్శకత్వం వహించనున్నారు. హారిక అండ్​ హాసిని ప్రొడక్షన్స్​, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను అందిస్తున్నాయి. తాజాగా, ఇందుకు సంబంధించిన పోస్టర్​ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్​లో దేవిక భంగిమలో సౌజన్య దర్శనమిచ్చింది. ఈ వేడుకకు పవర్​స్టార్ పవన్​కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కూడా పాల్గొననున్నారు. వీరితో పాటు తనికెళ్ల భరణి, త్రివిక్రమ్​, సురేశ్​, సతీశ్​ చంద్ర గుప్తా తదితరులు హాజరు కానున్నారు

    త్రివిక్రమ్, సౌజన్యల వివాహం కూడా ఓ సినిమా లెవెల్​లో జరిగింది. అక్కను చూసేందుకు వచ్చి చెల్లిని ఇష్టపడి.. ఇంట్లో వాళ్లను ఒప్పింది పెళ్లి చేసుకున్నాడు త్రివిక్రమ్​. ప్రస్తుతం వీరికి ఇద్దరు సంతానం.

    Also Read: అల్లు అర్జున్ “పుష్ప” చిత్ర బృందానికి మెగాస్టార్ చిరంజీవి విషెస్…

    Tags