Ranbir Kapoor- Alia Bhatt Wedding Date: రణబీర్, ఆలియా భట్ పెళ్లి ముహూర్తం ఖరారు అయిందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంది. అయితే, తాజాగా ఆ రచ్చకు ముగింపు పలకడానికి ఈ క్రేజీ కపుల్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఇండియా టుడే ప్రకారం, ఏప్రిల్ 14న రణబీర్ కపూర్ మరియు అలియా భట్ వివాహం చేసుకోబోతున్నారని రాబిన్ భట్ ధృవీకరించారు. రాబిన్.. మహేష్ భట్ సవతి సోదరుడు మరియు బాలీవుడ్‌లో రచయిత.

ఇక అలియా మెహందీ వేడుక ఏప్రిల్ 13న జరుగుతుందని ఇండియా టుడే తెలిపింది. అలాగే రిసెప్షన్ కి వెన్యూ కోసం రణబీర్ ముంబైలో పలు ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ను కూడా ఆల్ రెడీ బుక్ చేశాడని బాలీవుడ్ మీడియా చెబుతుంది. నాలుగేళ్లుగా ప్రేమించుకుంటూ మొత్తానికి ఇన్నాళ్ళకి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ జంట తమ పెళ్లికి సినిమా స్టార్స్ ని ఎవరినీ పిలవడం లేదని.. కేవలం కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది.
Also Read: Rajinikanth Basha movie: రజినీకాంత్ లైఫ్ ను మార్చేసిన బాషా మూవీ వెనక జరిగిన పరిణామాలు తెలుసా..?
ఐతే రిసెప్సన్ చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారట. షారుక్ ఖాన్, సంజయ్ లీల భన్సాలీ, ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, దీపిక, రణ్వీర్ సింగ్, వంటి సినీ ప్రముఖులకు ఇప్పటికే వెడ్డింగ్ కార్డ్స్ అందాయి. పెళ్లి, రిసెప్షన్ రెండూ ముంబైలోనే జరగనున్నాయి. అలియా భట్ తాతయ్య ఆరోగ్య పరిస్థితి విషమించింది. అలియా పెళ్లిని చూడాలన్న ఆయన కోరికను మన్నించి హడావిడిగా ఈ నెలలోనే పెళ్లి చేసుకుంటుంది ఆలియా.
అలియా – రణబీర్ నిశ్చితార్థం రణతంబోర్ (జైపూర్)లో జరిగింది. బాలీవుడ్ మీడియాకి కూడా తెలియకుండా చాలా సీక్రెట్ గా ఈ నిశ్చితార్థం వేడుక జరిగింది. అయినా ఉన్నట్టు ఉండి వీరి పెళ్లి వార్త బయటకు రావడానికి ముఖ్య కారణం.. సెలబ్రెటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రాతో రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ కనిపించింది. మనీశ్‌ను పెళ్లి దుస్తుల డిజైన్ కోసమే నీతూ కలసింది.

దాంతో అలియా – రణబీర్ కపూర్ పెళ్లి గురించి ప్రపంచానికి తెలిసింది. గత కొన్ని సంవత్సరాలుగా రణబీర్ తో అలియా పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. వీరి ప్రేమ పై పుకార్లు రాసి రాసి గాసిప్ రాయుళ్లు కూడా అలిసిపోయారు, కానీ.. వీళ్ళు మాత్రం తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించలేదు, ఎట్టకేలకు ఇన్నేళ్లకు ఈ లవ్‌బర్డ్స్ అధికారికంగా ఒక్కటి కాబోతున్నారు.
[…] ANR vs NTR and Jr NTR vs Ramcharan: తెలుగు సినిమా పరిధి పెరుగుతున్న కాలం అది. కానీ, సినిమా హీరోల మధ్య అప్పటి సమాజంలో కూడా తీవ్రమైన పోటీ ఉండేది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ విషయంలో చరణ్ – ఎన్టీఆర్ అభిమానుల ఎలా ఘర్షణ జరుగుతుందో.. అప్పట్లో కూడా ఈ స్థాయిలోనే చర్చలు జరిగేవి. అలాంటి టైంలో ఇండస్ట్రీకి వచ్చారు ఎన్టీఆర్, ఏఎన్నార్. అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ కంటే ముందుగా సినిమా రంగంలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. […]