Brahmastra Collections: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి బ్రహ్మాస్త్ర..సుమారు 300 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తెరకెక్కమ్చినా ఈ సినిమాకి అదిరిపొయ్యే వసూళ్లు వచ్చాయి..కేవలం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల రూపాయిలు గ్రాస్ సాధించిన చిత్రం గా సరికొత్త చిత్ర సృష్టించింది..ఇక తెలుగు లో అయితే ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..విడుదలకు ముందు నుండే ఈ సినిమా పై తెలుగు లో కూడా భారీ అంచనాలు ఉండేవి..ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా ఆరు కోట్ల రూపాయలకు జరిగింది..కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి మూడవ రోజు నుండి లాభాల బాట పట్టిన ఈ సినిమాకి 12 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..అంటే పెట్టిన డబ్బులకు రెండింతలు లాభాలు అన్నమాట..ఇప్పటికి ఈ సినిమాకి వీకెండ్స్ లో మంచి వసూళ్లే వస్తున్నాయి..కానీ హిందీ లో మాత్రం ఈ సినిమా ఇప్పటి వరుకు కేవలం 60 శాతం మాత్రమే రికవరీ చేసింది.

హిందీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 350 కోట్ల రూపాయలకు జరిగింది..అంటే ఈ సినిమా హిందీ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపుగా 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కచ్చితంగా రావాల్సిందే..అప్పుడే 350 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తాయి..కానీ ఇప్పటి వరుకు ఈ సినిమా కి 430 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది..ఇంకో రెండు వారాలు బాగా ఆడితేనే 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాని పరిస్థితి ఉండగా, ప్రస్తుతం కలెక్షన్స్ అయితే దారుణంగా పడిపోయాయి..మహా అయితే ఇంకో 70 కోట్ల రూపాయిలు గ్రాస్ మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది..అంటే దాదాపుగా ఈ సినిమా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను..మరియు వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను నష్టపొయ్యే ఛాన్స్ ఉందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..సినిమాకి మొదటి నుండి డివైడ్ టాక్ ఉండడం వల్లే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోతుంది..ఈ సినిమాకి ఉన్న భారీ హైప్ కి కనీసం యావరేజి టాక్ వచ్చి ఉన్న కూడా వెయ్యి కోట్ల రూపాయిలు వసూలు చేసిన సినిమాల లిస్ట్ లోకి వెళ్లి ఉండేదని బాలీవుడ్ ట్రేడ్ పండితుల అభిప్రాయం.