Kamna Jethmalani Viral Pics: ఒకప్పుడు ఎంతో అందంగా కనిపించిన కొంతమంది హీరోయిన్లు,ఇప్పుడు గుర్తు పట్టలేని స్థాయిలో , ఎలా ఉండే అమ్మాయి ఎలా అయిపోయింది అని అనుకుంటూ బాధపడుతుంటాము. కానీ మనకి ఒకప్పుడు యావరేజ్ రేంజ్ లో అనిపించిన కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇప్పటి యంగ్ జనరేషన్ హీరోయిన్స్ తో పోటీ ఇచ్చేంత అందంగా తయారు అవుతున్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు కామ్నా జఠ్మలానీ(Kamna Jethmalani). ఈమె మన టాలీవుడ్ లోకి ‘ప్రేమికులు’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆమెకి పెద్దగా గుర్తింపుని తీసుకొని రాలేదు. ఆ తర్వాత తమిళం లో ఒక చిత్రం చేసింది. అది కూడా ఆమెకు ఉపయోగపడలేదు. ఈ రెండు సినిమాల తర్వాత ఆమె చేసిన ‘రణం’ చిత్రం కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. హీరోయిన్ గా కామ్నా జఠ్మలానీ కి కూడా మంచి పేరొచ్చింది.
‘రణం’ తర్వాత ఈమె చేసిన ‘సామాన్యుడు’ కూడా అప్పట్లో మంచి హిట్ అయ్యింది. దీంతో ఈమెకు అవకాశాలు బాగా వచ్చాయి. కానీ సక్సెస్ లు మాత్రం రాలేదు. అయినప్పటికీ కూడా 2015 వ సంవత్సరం వరకు యాక్టీవ్ గా సినిమాలు చేస్తూ వచ్చింది. ఆ తర్వాత సూరజ్ నాగ్ పాల్ అనే బెంగళూరు బిజినెస్ మ్యాన్ ని పెళ్ళాడి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈమె 2022 వ సంవత్సరం లో ‘గరుడ’ అనే కన్నడ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2023 వ సంవత్సరం లో హీరోయిన్ హెబ్బా పటేల్ ప్రధాన పాత్ర పోషించిన ‘వ్యవస్థ’ అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించింది. ఇక ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ, వెబ్ సిరీస్ లోనూ ఈమె కనిపించలేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఈమెకు సమందించిన లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె రెగ్యులర్ గా యాక్టీవ్ గానే ఉంటుంది. ఎవరైనా ఫాలో అవ్వాలని అనుకుంటే అవ్వండి.