Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… త్రివిక్రమ్ మాటలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానాకి జోడీగా సంయుక్త మీనన్ చేస్తుంది. మలయాళంలో హిట్ కొట్టిన అయ్యప్పనుమ్ కోషీయం సినిమాకు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కాగా ఈ రోజు రానా పుట్టినరోజు సందర్భంగా రానా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది మూవీ యూనిట్.
‘స్వాగ్ ఆఫ్ డేనియల్ శేఖర్’ పేరుతో ఓ టీజర్ విడుదల చేశారు. ఈ వీడియోలో ‘వాడు అరిస్తే భయపడాలా ? ఆడికన్నా గట్టిగా అరవగలను. ఎవడాడు ? దీనమ్మా… దిగొచ్చాడా? ఆఫ్ట్రాల్ ఎస్సై. సస్పెండెడ్’ అని రానా డైలాగ్ చెప్పారు. డేనియల్ శేఖర్ పాత్రలో ఆవేశం చూపించారు. ఈ టీజర్‌లో పవన్ కూడా కనిపించడం విశేషం. కాగా ఈ టీజర్ లో మరోసారి జనవరి 12న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల కాదని, వాయిదా పడుతుందని బలమైన ప్రచారం జరుగుతోంది. కానీ నిర్మాత నాగవంశీ సహా యూనిట్ సభ్యులు ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వస్తున్నారు. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఈ ప్రోమో తో వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు ఎలా ఉండబోతున్నాయో అని అంచనాలను పెంచేశారు. కాగా రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Wishing a very Happy Birthday to our Raging DANIEL SHEKAR ~ @RanaDaggubati 🔥
An Epic Clash awaits, in theatres 12 Jan 2022 💥🤘#SwagofDanielShekar ➡️ https://t.co/BDLIuijzY2#BheemlaNayak @pawankalyan #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @vamsi84 @dop007
— Sithara Entertainments (@SitharaEnts) December 14, 2021